ఏకంగా 372 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఈ విజయంతో అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియాకు మంచి రన్ రేట్ కూడా రాబోతోంది.. అయితే ఇప్పటికే సొంత గడ్డపై న్యూజిలాండ్ జట్టును టీ20 లో క్లీన్స్వీప్ చేసింది టీమిండియా. ఇక ఇప్పుడు టెస్ట్ సిరీస్ కూడా కైవసం చేసుకుంది. అయితే న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు కనీస పోటీ ఇవ్వలేకపోయారు అని చెప్పాలి. అయితే రెండవ టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ విన్నర్ అజాజ్ పటేల్ ఏకంగా 10 కి 10 వికెట్లు తీసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇలా అజాజ్ పటేల్ అద్భుతంగా రాణించిన ప్పటికీ ఇది జుట్టుకు మాత్రం విజయం అందించలేకపోయింది అనే చెప్పాలి.
భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగియడం తో తన వ్యూహాలకు పదును పెట్టింది టీమిండియా. ఈ క్రమంలోనే గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది అని చెప్పాలి. అయితే ఇది టీమిండియాకు వరుసగా 14వ సిరీస్ కావడం గమనార్హం. నాలుగో రోజు ఆటలో భారత బౌలర్లు విజృంభించడంతో కేవలం 27 పరుగుల 5 వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్ జట్టు.