
ఈ పర్యటనలో మొత్తం మూడు టెస్ట్ లు మరియు మూడు వన్ డే మ్యాచ్ లు ఆడనున్నారు. ఈ సిరీస్ తో సౌత్ ఆఫ్రికా ఓపెనింగ్ బ్యాట్స్మన్ డీన్ ఎల్గర్ కెప్టెన్ గా నియమితుడయ్యాడు. అతనికి ఇదే మొదటి మ్యాచ్ కావడం, అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్ ఇన్ ది వరల్డ్ ఇండియాతో తన కెప్టెన్సీ కెరీర్ స్టార్ట్ అవుతుండడంతో ఒకింత ఒత్తిడిలో పడ్డట్లే. ఈ మ్యాచ్ లో గెలవడం అటుంచి కనీసం డ్రా చేసుకున్న డీన్ ఎల్గర్ కు శుభారంభం దొరికినట్లే? కానీ ఫుల్ ఫామ్ లో ఉన్న టీం ఇండియాను జూనియర్లతో కూడిన సౌత్ ఆఫ్రికా నిలువరించడం అంటే కఠిన మైన సవాలు అని చెప్పాలి.
భారత కాలమాన ప్రకారం రేపు మధ్యాహ్నం 1 . 30 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఇండియా ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. మొదటి రెండు రోజులు బ్యాటింగ్ కు స్వర్గ ధామంగా ఉండనుంది. ఆఖరి రెండు రోజులు బౌలర్లకు అనుకూలించ నుందని పిచ్ క్యూరేటర్ లు అంటున్నారు. మరి మొదటి రోజు ఏమి జరగనుంది? జట్లు కూర్పు ఏ విధంగా ఉండనుంది అన్న వివరాలు తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.