
ఇక సుదీర్ఘమైన విరామం తర్వాత ఇటీవలే రవిచంద్రన్ అశ్విన్ భారత టీ-20 జట్టులొ అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇండియా వేదికగా న్యూజిలాండ్తో జరిగిన టి20 సిరీస్ లో అవకాశాన్ని దక్కించుకుని ఇక మళ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్లో అడుగు పెట్టాడు. టి20 మ్యాచ్ లో అద్భుతంగా రాణిస్తూ కీలకమైన సమయంలో వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు రవిచంద్రన్ అశ్విన్. ఇక అటు మరో పరిమిత ఓవర్ల ఫార్మాట్ అయిన వన్డే ల్లోకి రవిచంద్రన్ అశ్విన్ సెలెక్ట్ అవుతాడా లేదా అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఎట్టకేలకు సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ ను వన్డే జట్టులోకి ఎంపిక చేసింది బిసిసీఐ.
ప్రస్తుతం భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్ ఆడబోతుంది టీమిండియా. ఇక ఈ మ్యాచ్ కు రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించాల్సి ఉంటే గాయం బారినపడి దూరం కావడంతో చివరకు కె.ఎల్.రాహుల్ వన్డే జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇక ఇటీవల జట్టు వివరాలను ప్రకటించింది బిసిసీఐ. ఈ క్రమంలోనే రవిచంద్రన్ అశ్విన్ టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఆడబోయే వన్డే జట్టులో స్థానం సంపాదించుకున్నట్లు తెలుస్తోంది. ఇక రవిచంద్రన్ అశ్విన్ సుదీర్ఘమైన నిరీక్షణకు తెరపడటంతో అభిమానులందరూ మురిసిపోతున్నారు.