అయితే సౌత్ ఆఫ్రికా పర్యటన మొదలైన తర్వాత ఇప్పటివరకు విరాట్ కోహ్లీ విలేకరుల సమావేశానికి రాకపోవడానికి వెనుక పెద్ద కారణమే ఉంది అన్నది తెలుస్తుంది. టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. 100వ టెస్ట్ ఆడేటప్పుడు మాట్లాడాలని విరాట్ కోహ్లీ అనుకుంటున్నాడు అందుకే అప్పటి వరకు మీడియాకు దూరంగా ఉండాలి అని అనుకుంటున్నాడు అంటూ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. అయితే దక్షిణాఫ్రికా పర్యటన మొదలైన తర్వాత ఇప్పటివరకు మీడియా ముందుకు రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏదీ లేదు అంటూ చెప్పుకొచ్చారు.
కానీ 100 టెస్ట్ రోజు మాత్రమే విలేకర్లతో మాట్లాడుతాను అంటూ విరాట్ కోహ్లీ నాతో చెప్పాడు అంటూ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. ఇక ఆ సమయంలో మీరు విరాట్ కోహ్లీని ఎన్ని ప్రశ్నలైన అడగొచ్చు అంటూ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. అయితే అన్ని మ్యాచ్లో విజయం సాధించేలా నేను జట్టు ఫలితాలను నిర్ణయించలేను అంటూ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. జట్టు మెరుగ్గా రాణించే విధంగా సన్నద్ధం చేయగలను అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే జనవరి 11వ తేదీన కేప్ టౌన్ వేదికగా ప్రారంభం కాబోయే మూడవ టెస్ట్ మ్యాచ్ తో విరాట్ కోహ్లీ100వ టెస్ట్ మైలురాయిని చేరుకుంటాడు. ఈ క్రమంలోనే వందో టెస్టు రోజు విరాట్ కోహ్లీ ఏదైనా కీలక ప్రకటన చేయబోతున్నాడా అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.