అయితే ప్రస్తుత టీం ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తర్వాత నయావాల్ గా గుర్తింపు పొందిన పుజారా.. వరుసగా విఫలమవుతున్నాడు. నయావాల్ పుజారాను డమ్మీ వాల్ గా పిలుస్తూ సెటైర్లు పేల్చుతున్నారు. డమ్మీ వాల్ డకౌటయ్యాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. వరుసగా విఫలమవుతున్నా ఎందుకు అవకాశం ఇస్తున్నారని, ఫామ్‌లో ఉన్న యువ ఆటగాళ్లను కాదని, పుజారాకి అవకాశం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలు పుజారా ఇంకా జట్టులో ఎందుకు ఉన్నాడని, గత కొన్ని నెలలుగా అతను తీవ్రంగా సతమతమవుతున్నాడని, అతని స్థానంలో విహారీ లేదా శ్రేయస్ అయ్యార్‌ను ఆడించవచ్చు కదా... అని ప్రశ్నిస్తున్నారు.
సౌత్ ఆఫ్రికా లో భారత ఏ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన హనుమ విహారిని, ఇండియాలో న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో సెంచరీతో ఆకట్టుకుని అయ్యర్ ను బెంచ్ పై కూర్చోబెట్టి.. వరుసగా విఫలమవుతున్న పుజారాకు అవకాశం ఇవ్వడం ఏంటి అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ఐపీఎల్ 2021 సీజన్ కోసం పుజారాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే అదే జట్టులో లుంగి ఎంగిడి కూడా ఉన్నాడు. దాంతో ఐపీఎల్ కోసం చేస్తున్న ప్రాక్టీస్ లో పుజారా బలహీనతను లుంగి ఎంగిడి పసిగట్టాడని కామెంట్స్ వస్తున్నాయి.