
ఇండియా కష్టాల్లో ఉన్న ప్రతి సారి కూడా తన బౌలింగ్‌తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఇప్పటివరకు ఎన్నో క్లిష్ట సమయాల్లో అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లను తీసుకున్న జస్ప్రిత్ బుమ్రా టీమిండియాకు విజయాన్ని అందించాడు. అంతేకాదు తన బౌలింగ్ ప్రతిభతో ఎన్నో అద్భుతమైన రికార్డులు సైతం కొల్లగొడుతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇక టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సంధించే యార్కర్లకు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ల దగ్గర అసలు సమాధానమే ఉండదు. అంతలా తన బౌలింగ్‌తో రాణిస్తూ రికార్డులు కొల్లగొడుతు ఉంటాడు జస్ప్రిత్ బూమ్రా. ఇటీవలే మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇటీవలి కాలంలో టెస్ట్ క్రికెట్ లో ప్రతి మ్యాచ్‌లో కూడా అద్భుతంగా రాణిస్తూ భారీగా వికెట్లను తీసుకుంటున్నాడు జస్ప్రిత్ బూమ్రా. ఈ క్రమంలోనే సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు లో ఐదు వికెట్లతో చెలరేగిన జస్ప్రిత్ బుమ్రా అరుదైన ఘనత ను తన ఖాతాలో వేసుకున్నాడు. జస్ప్రిత్ బూమ్రా ఐదు వికెట్లు తీయడం ఇది ఏడోసారి. అయితే భారత్ తరఫున ఇప్పటి వరకు 7 సార్లు 5 వికెట్లు తీసిన క్రికెటర్లలో కపిల్‌దేవ్, ఇర్ఫాన్ పఠాన్ లాంటి క్రికెటర్లు ఉన్నారు. ఇప్పుడు వీరి సరసన నిలిచాడు సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. జస్ప్రిత్ బూమ్రా సాధించిన ఐదు వికెట్ల ప్రదర్శనలు మొత్తం విదేశాల్లోనే కావడం గమనార్హం..