
షమీ అసలు డేంజర్ ఏరియాలో అడుగు పెట్టలేదంటూ గట్టిగా వాదిస్తూ.. అంపైర్‌కి మాటకి మాట బదులిచ్చాడు. కోహ్లీ, ఎరాస్మస్ మధ్య వాగ్వాదం తర్వాత మహ్మద్ షమీ బౌలింగ్ చేసిన తీరుపై రిప్లైని పరిశీలించగా.. షమీ పిచ్ డేంజర్ ఏరియాకి వెలుపలే అడుగులు పెడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. దాంతో.. ఈ రిప్లైని స్టేడియంలోని బిగ్ స్క్రీన్స్‌పై చూసిన కోహ్లీ.. మరోసారి అంపైర్ ఎరాస్మస్ వైపు చూస్తూ సైగలు చేశాడు. పిచ్ డేంజర్ ఏరియాలో ఆటగాళ్ల పాద ముద్రలు పడితే? అది స్పిన్నర్లకి అనుకూలించనుంది. అంపైర్ అఫిషియల్ వార్నింగ్ తర్వాత కూడా ఫీల్డింగ్ టీమ్ అదే తప్పిదానికి పాల్పడితే? ఆ జట్టుకి 5 పరుగుల జరిమానా విధిస్తారు. ఒకవేళ బ్యాట్స్‌మెన్ ఈ తప్పిదానికి పాల్పడినా 5 పరుగుల జరిమానా తప్పదు.