కాగా ఇక బిసిసీఐ ముందుగా ప్రకటించి నట్టుగానే 12, 13 తేదీలలో మెగా వేలం నిర్వహించడానికి రెడీ అయి పోయింది. బెంగళూరు వేదికగా ఈ మెగా వేలం జరగ బోతుంది. ఇక ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అవగా.. మరి కొన్ని నిమిషాల్లో మెగా వేలం ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఇక ఇప్పటికే మెగా వేలంలో ఏ ఆటగాళ్లను సొంతం చేసుకోవాలనే దానిపై అన్నీ జట్ల ప్రాంఛైజీలు కూడా వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. ఇలాంటి సమయం లోనే ఎంతో మంది ఆటగాళ్లకు భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది.
ఐపీఎల్ మెగా వేల ఐదు వందల తొంభై మంది ఆటగాళ్లు పాల్గొంటుండగా ఇక అందరి ఆటగాళ్లను ఏకంగా డిఫరెంట్ కేటగిరీ లుగా విభజించి ఉన్నట్లు తెలుస్తోంది ఎక్స్ కెప్టెన్స్, ఓపెనింగ్ బ్యాట్ మెన్స్, ఆల్ రౌండర్, పేస్ బౌలర్ , స్పిన్నర్స్, అండర్ 19 ప్లేయర్స్, వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ ఇలా ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొంటున్న ఎంతో మంది ఆటగాళ్లను వివిధ కేటగిరీ లలో డివైడ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక వీటి ఆధారంగానే ఆటగాళ్లను కొనుగోలు చేయడం కూడా చేస్తాయి ఫ్రాంచైజీలు.