సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న జట్టు. స్టార్ ఆటగాళ్లు లేకుండానే ఏకంగా ఒక సారి టైటిల్ గెలిచిన జట్టు.. ఎప్పుడు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఐపీఎల్లో దిగ్గజ జట్టుగా కొనసాగుతున్న వారికి సైతం ముచ్చెమటలు పట్టించిన జట్టు. ఇదంతా మొన్నటివరకు ఇక ఇప్పుడు ఐపీఎల్ మెగా వేలంలో రానున్న రోజుల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎలా ప్రస్థానాన్ని కొనసాగించపోతున్నది అన్నది ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది.


 మొన్నటి వరకు సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ఉన్నా డేవిడ్ వార్నర్ సహా ఎంతో మంది ఆటగాళ్లను మెగా వేలంలోకి వదిలేసింది జట్టు యాజమాన్యం. నలుగురు ని తమతో పాటు అంటిపెట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ కేవలం ముగ్గురిని మాత్రమే రిటైన్ చేసుకుంది. ఇందులో కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇద్దరు యువ ఆటగాళ్లు ఉన్నారు. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ రోడ్డు వద్ద 22 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇంకా 68 కోట్లు మిగిలి ఉన్నాయి. దీంతో సరైన జట్టును ఎంపిక చేసుకోవడం పై దృష్టి పెట్టింది సన్రైజర్స్ జట్టు యాజమాన్యం.


 ముఖ్యంగా ఒకప్పటి డేవిడ్ వార్నర్ జానీ బెయిర్ స్టో లాంటి గొప్ప ఓపెనర్లను వెతుక్కోవాల్సిన అవసరం ఉంది  ఈ క్రమంలోనే ప్రస్తుతం వేలంలో ఉన్న ఫాబ్ డూప్లేసెస్, క్వింటన్ డీకాక్ లాంటి ఆటగాళ్ళని సన్రైజర్స్ జట్టులోకి తీసుకుంటే బెటర్. ఇక సన్రైజర్స్ కి ఎప్పుడు మిడిలార్డర్ సమస్య ఎదురయ్యేది. ఇక ఇప్పుడు మెగా వేలం నేపథ్యంలో ఈ సమస్యపై దృష్టి పెట్టాలి. సురేష్ రైనా, అంబటి రాయుడు లాంటి ఆటగాళ్లలో ఎవరిని ఎంచుకున్న మిడిలార్డర్ పటిష్టంగా మారుతుంది. ఇక ఆల్రౌండర్ల సమస్య కూడా హైదరాబాద్ జట్టులో గతంలో ఉంది. ఇప్పుడు శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, షకీబ్ అల్ హసన్, రాహుల్ త్రిపాఠీ లాంటి ఆటగాళ్లను ఎంచుకుంటే బెటర్.  రషీద్ సరితూగే స్పిన్నర్ భువనేశ్వర్ కు సరితూగే ఫేసర్ ని ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది. ఇక మెగా వేలంలో సన్రైజర్స్ ఎవరిని తీసుకోబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: