ఇక ఇలా ఐపీఎల్లో గొప్ప ప్లేయర్ గా ప్రస్థానాన్ని కొనసాగించినా సురేష్ రైనా ఇక ఇటీవల జరిగిన మెగా వేలంలో మాత్రం అన్ సోల్డ్ ఆటగాడిగా మిగిలిపోయాడు. దీంతో అభిమానులు అందరూ షాక్ అయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ రైనా ను రిటైన్ చేసుకోకుండా సురేష్ రైనాను మెగా వే లంలోకి వదిలేసింది. కానీ మళ్ళీ అతని వేలంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అదే సమయంలో మిగతా ఫ్రాంచైజీలు కూడా అతడి పక్కన పెట్టేశాయ్. దీంతో సురేష్ రైనా అన్ సోల్డ్ గా మిగిలిపోవడం గురించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతుంది.ఇక ఇటీవల ఇదే విషయంపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సురేష్ రైనా ను ఎంపిక చేయక పోవడంపై పలు కారణాలను వెల్లడించాడు. యూఏఈలో ఐపీఎల్ జరిగిన సమయం లో సురేష్ రైనా చెన్నై జట్టు విశ్వాసాన్ని కోల్పోయాడు. అసలేం జరిగింది అన్న విషయం గురించి ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదు. దీని గురించి జరగాల్సిన చర్చ జరిగిపోయింది. అయితే చెన్నై జట్టుతో పాటు కెప్టెన్ ధోనీ నమ్మకాన్ని కూడా రైనా కోల్పోయాడు ఎవరి విషయంలోనైనా ఇలా ఒక్కసారి జరిగిందంటే తిరిగి జట్టులోకి రావడం అసాధ్యం.. సురేష్ రైనా విషయంలో కూడా ఇదే జరిగింది అంటూ ఒక క్రీడా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సైమన్.