స్వదేశంలో టీమిండియా తిరుగు లేదు అన్న విధంగా ప్రస్తుతం దూసుకుపోతోంది. వరుస విజయాలను సాధిస్తూ ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ప్రత్యర్థి ఎవరైనా సరే లెక్క చేయకుండా విజయ ఢంకా మోగిస్తోంది. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న తర్వాత ఇప్పటివరకు టీమిండియా ఒక్కసారి కూడా ఓటమి చవి చూడ లేదు అని చెప్పాలి. ఇటీవలే భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ పై పూర్తి ఆదిపత్యాన్ని సాధించిన టీమిండియా.. వన్డే టి20 సిరీస్ లలో కూడా వెస్టిండీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఇప్పుడు అదే జోరును శ్రీలంకతో జరుగుతున్న సిరీస్ లలో కూడా కొనసాగిస్తోంది.



 ఇటీవలే శ్రీలంక జట్టుతో టి20 సిరీస్ ముగించింది టీమిండియా. ఈ టి 20 సిరీస్ లో కూడా ప్రత్యర్థి శ్రీలంకకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యం సాధించి 3-0 తేడాతో విజయం సాధించింది టీమిండియా. శ్రీలంక జట్టును వైట్వాష్ చేసేసింది. ఇక పోతే ఇక శ్రీలంక తో టీ20 సిరీస్ విజయం తర్వాత అటు టీమిండియా ఎన్నో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి. అంతర్జాతీయ టి20లో శ్రీలంకపై 17వ సారి గెలిచి.. ఒక జట్టుపై అత్యధిక మ్యాచుల లో గెలిచిన జట్టుగా ఉన్న టీమిండియా అరుదైన రికార్డుని అందుకుంది. ఇక శ్రీలంకతో మూడవ టి20 మ్యాచ్ లో గెలుపు భారత జట్టుకు సొంతగడ్డపై 40 గెలుపు కావడం గమనార్హం.


 దీంతో ఇప్పటి వరకు సొంతగడ్డపై 39 విజయాలతో మొదటి స్థానంలో ఉన్న న్యూజిలాండ్ రికార్డును అధిగమించింది టీమిండియా. అంతేకాకుండా టీ20ల్లో అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్టుగా కూడా సృష్టించింది. కాగా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ రొమేనియా జట్టు టి-20 లో అత్యధికంగా వరుసగా 12 సార్లు గెలిచిన జట్లుగా ఉన్నాయి. కాగా ఇప్పుడు టీమిండియా ఈ రికార్డును సమం చేసింది. ఇలా ఒక్క సిరీస్ విజయంతో ఎన్నో అరుదైన రికార్డులు టీమిండియా ఖాతాలో చేరిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: