బీసీసీఐ ప్రతియేడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్ లో స్టార్లుగా కొనసాగుతున్న వారు సైతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.  అంతలా క్రేజ్ సంపాదించుకుంది ఐపీఎల్. అంతేకాదు ఐపీఎల్ ఆడటం వల్ల ఎంతో అనుభవం సాధించామని ఆట కూడా మెరుగు పడింది అంటూ చెబుతూ ఉంటారు క్రికెటర్లు. ప్రపంచంలోనే రిచెస్ట్ లీగ్ గా కూడా కొనసాగుతుంది. ఇకపోతే ఇటీవల ఇంగ్లాండ్కు చెందిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ లారెన్స్ బూత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై విమర్శలు చేశాడు.


 క్రికెట్ క్యాలెండర్ ఇయర్లో 1/3 మూడోవంతు ఐపీఎల్ ఆక్రమిస్తుంది అని.. దీనివల్ల ఆటగాళ్లకు మానసిక స్థైర్యం దెబ్బతింటుంది అంటూ కామెంట్స్ చేశాడు. అతని కామెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారగా ఇదే విషయంపై భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఐపీఎల్ 1/3 వంతు ఆక్రమిస్తుంది అని లారెన్స్ బూత్ వ్యాఖ్యానించాడు. అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.. మీ దేశంలో జరిగే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కనీసం ఆరు నెలల పాటు జరుగుతుంది. దీనికి సమాధానం ఏం చెబుతారు. ఐపీఎల్లో ఆటగాళ్లకు మంచి రెస్ట్ దొరుకుతుంది.. వారానికి ఒక జట్టు  2 మ్యాచ్ లు మాత్రమే ఆడుతుంది. ఏదో ఒక దశలో మూడు మ్యాచ్లు ఆడిన సందర్భాలు మాత్రం ఉంటాయి.


 ఈ లెక్కన చూసుకుంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్న ఆటగాళ్లకు మంచి  రెస్ట్ దొరికినట్లే కదా... వాస్తవానికి ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్లు ఎక్కువ అలసిపోతున్నారు ఏమో ఒకసారి చూసుకో.. వీలైతే ఈపిఎల్ పై విమర్శలు చేయు.. సోయి లేకుండా మాట్లాడకు ఐపీఎల్ వల్ల ఎంతో మంది ఆటగాళ్లకు పేరుతో పాటు దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం కూడా దక్కించుకున్నారు  అంటూ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: