విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. విరాట్ కోహ్లీ తన కెరీర్లో మైలురాయి లాంటి  వందవ టెస్ట్ మ్యాచ్ ఆడుతూ ఉండడంతో ప్రపంచ క్రికెట్లో అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ప్రస్తుతం వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో తన వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. దీంతో ఇక ఈ 100 వ టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆట తీరు ఎలా ఉంటుంది అన్న దానిపైనే అభిమానుల అందరి కన్ను ఉంది అని చెప్పాలి.


 ఇక తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన 100 టెస్ట్ మ్యాచ్ ను మరింత ప్రత్యేకంగా మార్చుకునేందుకు అద్భుతంగా రాణించేందుకు విరాట్ కోహ్లీ గత కొన్ని రోజుల నుంచి నెట్లో తీవ్రంగా ప్రాక్టీస్ చేసాడు అనే విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ప్రారంభమైన టెస్టు మ్యాచ్లో 73 బంతుల్లో 45 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ జోరు చూస్తే సెంచరీ చేయడం పక్క అని అందరూ అనుకున్నారు. కానీ అంతలో విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయాడు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ లో బాగా రాణిస్తాడని అభిమానులు అనుకుంటున్నారు.


 ఇకపోతే వందో మ్యాచ్ తో కీలకమైన మైలురాయిని అందుకున్న విరాట్ కోహ్లీ ఇక మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. విరాట్ కోహ్లీ తొలి టెస్టులో 38 పరుగుల వద్ద వేగంగా టెస్టు ఫార్మాట్లో 8000 పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రావిడ్,సునీల్ గవాస్కర్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ టెస్ట్ క్రికెట్లో 8వేల పరుగుల మైలురాయిని అందుకుంది ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా టెస్టుల్లో 900 ఫోర్లు కంప్లీట్ చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. క్రికెట్ కెరీర్ లో 27 సెంచరీలు  28 హాఫ్ సెంచరీ లు ఉండగా ఆవరేజ్ 50.53 గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: