అచ్చంగా ఇలాగే మహేంద్ర సింగ్ ధోనీ లాగా ఎంతోమంది ప్రయత్నించి విఫలం అయ్యారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవలే న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ కప్ లో భాగంగా భారత వికెట్ కీపర్ రిచా ఘోష్ మెరుపువేగంతో అద్భుతమైన స్టంపింగ్ చేసిన తీరు అభిమానులందరినీ కూడా ఆకర్షిస్తుంది. అచ్చం మహేంద్ర సింగ్ ధోనీ లాగే రెప్పపాటుకాలంలో స్టంపింగ్ చేసింది అంటూ ఎంతో మంది అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మహిళల ప్రపంచ కప్ లో భాగంగా భారత జట్టు మొదటి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తలపడింది.
ఇక ఈ మ్యాచ్లో ఘన విజయాన్ని సాధించింది టీమిండియా జట్టు. ఇక ఈ మ్యాచ్లో భాగంగా భారత మహిళా వికెట్కీపర్ రీఛా మెరుపువేగంతో చేసిన స్టంపింగ్ అందరిని ఆశ్చర్యపరిచింది. పాక్ ఇన్నింగ్స్ సమయంలో 30 ఓవర్లు రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్లో అలియా రియాజ్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించింది. ఇక అది మిస్ అయ్యి వికెట్కీపర్ రీఛా చేతికి వెళ్ళింది. అయితే వెంటనే రిచా మెరుపు వేగంతో వికెట్లను కొట్టేసింది. దీంతో ఇక పాకిస్తాన్ బ్యాటర్ అలియా రియాజ్ పెవిలియన్కు చేరక తప్పలేదు. రీఛా ఘోష్ స్టంపింగ్ కు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోతూ ఉండడంతో లేడీ ధోని అంటూ ప్రశంసలు కురిపిస్తూ ఉండటం గమనార్హం.