టీమిండియా లో సీనియర్ స్పిన్నర్ గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ ఇటీవలే శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్లో అద్భుతంగా రాణించి అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. గత కొంత కాలం నుంచి ఎన్నో రికార్డులను తిరగరాస్తు వస్తున్న రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా విజయంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇకపోతే ఇటీవల భారత్ తరఫున  టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ రెండవ స్థానం లోకి వచ్చేశాడు.



 శ్రీలంకతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో తన కెరీర్ లో 435 వికెట్లు సాధించాడు. తద్వారా అప్పటివరకు టీమిండియా దిగ్గజం కపిల్దేవ్ పేరున ఉన్న 434 వికెట్లు రికార్డును అధిగమించాడు రవిచంద్రన్ అశ్విన్. అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీ లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో ఇక అశ్విన్ ఘనత సాధించడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ నా దృష్టిలో రవిచంద్రన్ అశ్విన్ ఆల్ టైం గ్రేట్.. జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు.. అందుకే నా అభిప్రాయం ప్రకారం ఎల్లప్పుడూ గొప్ప ఆటగాడు అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.



 ఇక ఇదే విషయం పై స్పందించిన పాకిస్థాన్ మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యల తో ఏకీభవించలేను అంటూ వ్యాఖ్యానించాడు.  అశ్విన్ గొప్ప బౌలర్ అనడం లో ఎలాంటి సందేహం లేదు. తన బౌలింగ్లో వైవిధ్యం కూడా ఉంటుంది. టెస్టుల్లో అతనికి మంచి రికార్డు కూడా ఉంది. కానీ అతను ఆల్ టైం గ్రేట్ బౌలర్  ఏంటి రోహిత్ పొరపాటు పడుతున్నాడు. నా అభిప్రాయం ప్రకారం అనిల్ కుంబ్లే  గొప్ప బౌలర్.. కిషన్ సింగ్ బేడీ కూడా గొప్ప బౌలర్ అంటూ వ్యాఖ్యానించాడు రషీద్ లతీఫ్.

మరింత సమాచారం తెలుసుకోండి: