క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 26వ తేదీ నుంచి ఐపీఎల్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈసారి ఐపీఎల్ లో సరికొత్త ఫార్మాట్ లో జరగబోతు ఉండటం.. ఇటీవల కాలంలో మెగా వేళ నేపథ్యంలో ఎంతో మంది ఆటగాళ్లు ఒక జట్టు నుంచి మరో జట్టులోకి వెళ్ళిపోవడంతో ఇక ఈసారి ఐపీఎల్ మరింత రసవత్తరంగా ఉంటుందని నమ్ముతున్నారు ప్రేక్షకులు.


 ఇక సరికొత్త ఫార్మాట్ నేపథ్యంలో ఏ జట్టు ఈసారి అద్భుతంగా రాణించి టైటిల్ను ఎగరేసుకుపోతుంది అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇక ఇప్పటివరకు ఐపీఎల్ లో కొంత మంది ఆటగాళ్లు క్రియేట్ చేసిన రికార్డులు గురించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి అని చెప్పాలి.  ఇక ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లతో పాటుఎక్కువ వికెట్లు తీసిన ఆటగాల్లు, మేడిన్ ఓవర్లు వేసిన బౌలర్లు ఎవరు అన్న విషయాలు కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి.


 అయితే ఇక ఒక్కసారి ఐపీఎల్ హిస్టరీ లోకి వెళ్లి అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్ వివరాలు ఏంటో తెలుసుకుందాం. ప్రవీణ్ కుమార్  ఐపీఎల్ లో 14 ఓవర్లు మేడిన్  వేసిన ఆటగాడిగా టాప్ ప్లేస్లో కొనసాగుతుండడం గమనార్హం. ఆ తర్వాత ఇర్ఫాన్ పఠాన్ 10 ఓవర్లు మెడిన్ వేసి రెండవ స్థానంలో ఉన్నాడు. భారత స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తొమ్మిది ఓవర్లు మేడిన్  వేసి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. దావల్ కులకర్ణి ఎనిమిది ఓవర్లు మేడిన్ వేసాడు. శ్రీలంక బౌలర్ మలింగా ఎనిమిది ఓవర్లు మేడిన్  వేశారు. సీనియర్ బౌలర్ సందీప్ శర్మ ఎనిమిది ఓవర్లు మేడిన్  వేసి సత్తా చాటాడు.  డెల్ స్టేయిన్ ఏడు ఓవర్లు మేడిన్  వేసి ఈ లిస్టులో కొనసాగుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl