
సాధారణంగా ప్రతి జట్టులో బ్యాటింగ్ కోచ్ బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్,మెంటార్,డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్, ఫిజియో కోచ్ ఇక వీరందరినీ కంట్రోల్ చేసే హెడ్ కోచ్. ఇలా ఎంతోమంది సహాయ సిబ్బంది ఐపీఎల్లో జట్లు రాణించేందుకు ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటారు. కానీ ఇక ఇప్పుడు ఇందులోకి కొత్త పాత్ర కూడా వచ్చేసినట్లు తెలుస్తోంది. అదే పవర్ హిట్టింగ్ కోచ్. ఇక ఇలా పవర్ హీట్టింగ్ లో శిక్షణ ఇచ్చేందుకు ఇటీవలే పంజాబ్ కింగ్స్ 2022 సీజన్ కోసం ఇంగ్లాండ్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ జూలియన్ రాస్ వుడ్ ను కోచ్గా పెట్టుకుంది. తమ జట్టులో ఉన్న మయాంక్ అగర్వాల్, లివింగ్ స్టోన్, వుడెన్ స్మిత్, షారుక్ ఖాన్ ఆటగాళ్ల హిట్టింగ్ ను మరింత మెరుగులు దిద్దేందుకు మంచి ఫలితం రాబట్టేందుకు ఇక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటివరకు బిగ్ బాష్ లీగ్, కరేబియన్ లీగ్, ఇంగ్లాండ్ కౌంటిలో పనిచేసిన జూలియన్ రాస్ వుడ్ ఐపీఎల్ లోకి రావడం మాత్రం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇక ఇప్పటి వరకూ ఎంతో మంది స్టార్ ప్లేయర్లు సిక్సర్లు బాదే నైపుణ్యం పెంచుకోవడానికి ఇతను ఎంతో కీలకపాత్ర వహించాడు. బౌలర్ ఎవరు బంతి ఎలా వచ్చింది అన్నది కాదు బలమంతా ఉపయోగించి సిక్సర్ కొట్టడమే అన్నది ఎక్కువగా చెబుతూ ఉంటాడు జూలియన్ రాస్ వుడ్. క్రీజులో బ్యాటర్ నిలబడిన తీరును బట్టి అతను ఎంత శక్తిని వాడతాడు. సంప్రదాయ శైలి షాట్లు ఆడి శరీరం చేతుల సమన్వయం అనేది ఇక్కడ కుదరదు.. నా దృష్టిలో రెండు వేరు వేరు. బేస్బాల్ తరహాలోనే ఎడమ కాలు వెనక్కి వెళ్తూ తుంటి భాగం పై భారం వేసి షాట్ కొట్టడం ఎంతో సులువు అవుతుంది అంటూ చెబుతున్నాడు జూలియన్ రాస్ వుడ్. ఇక నైపుణ్యం లేని వారిని తీర్చిదిద్దడమే లక్ష్యం అంటూ చెబుతున్నాడు. ఒకవేళ ఈ ఐడియా గనుక సక్సెస్ అయితే రానున్న రోజుల్లో మిగతా ఐపీఎల్ టీమ్ లు కూడా ఇదే ఐడియా ఫాలో అయ్యే అవకాశం ఉంది..