మలయాళ చిత్ర పరిశ్రమలో నటుడిగా మ్యూజిక్ కంపోజర్గా వినాయకన్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తనదైన శైలిలో పాత్రల్లో ఒదిగిపోతూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అదే సమయంలో ఇక ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉన్నాడు వినాయకన్. ఇక ఇప్పుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక వినాయకన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రస్తుతం మహిళా లోకం ఆగ్రహానికి గురి అవుతున్నాడు.
ఇటీవలే తాను నటించిన లేటెస్ట్ మూవీ ఓరుతే మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు వినాయకన్. ఇక ఇంటర్వ్యూ లో భాగంగా కొంతమంది మీటు ఉద్యమం గురించి ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మాట్లాడిన వినాయకన్ మీ టు ఉద్యమం గురించి తెలియదు. దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నా జీవితంలో 10 మంది మహిళలతో సెక్స్ లో పాల్గొన్నాను. మహిళలను సెక్స్ చేయమని అడిగినా కూడా అది మీ టూ అవుతుందా.. అలా అయితే నేను దానిని కంటిన్యూ చేస్తాను అంటూ వినాయకన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు..