శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే తన కెప్టెన్సీ సామర్థ్యంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు అన్న విషయం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్ యువ ఆటగాళ్లు అందర్నీ కూడా సమన్వయంతో ముందుకు నడిపించి ఏకంగా జట్టు ఫైనల్లో నిలబెట్టడంలో కీలకపాత్ర వహించాడు. ఇక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ వ్యూహాలను చూసి అతనే ఫ్యూచర్ కెప్టెన్ అని అందరూ అనుకున్నారు. అంత అద్భుతంగా కెప్టెన్సీ తో అందరిని మెప్పించాడు యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్.


 కానీ అనుకోని విధంగా అటు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ నుంచి శ్రేయస్ అయ్యర్ తప్పుకున్నాడు అన్న విషయం తెలిసిందే. గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్   ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు దూరం కావడంతో రిషబ్ పంత్ సరికొత్త కెప్టెన్ గా నియమించారు. శ్రేయస్ అయ్యర్ మళ్లీ జట్టులోకి వచ్చిన ఇక అతనికి కెప్టెన్సీ అప్పగించలేదు. అయితే ఇటీవల జరిగిన మెగా వేలంలో అటు శ్రేయస్ అయ్యర్ ను కోల్కత నైట్రైడర్స్ జట్టు దక్కించుకుని కెప్టెన్సీ అప్పగించింది. ఇక ఇటీవలే కోల్కతా జట్టు కెప్టెన్గా శ్రేయస్ మరోసారి తన వ్యూహాలతో ఏకంగా దిగ్గజ చెన్నై సూపర్ కింగ్స్ మీద విజయం సాధించాడు.



 ఇకపోతే ఇటీవలే మాట్లాడినా కోల్కతా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ఈ సారి తమ సారధి శ్రేయస్ అయ్యర్ తమ జట్టును విజేతగా నిలుపుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. వేలంలో తొలిసారి నా పేరు పిలవగానే ఎవరూ ఆసక్తి చూపించలేదు. కానీ మూడో సారి నా పేరు పిలవగానే కోల్కత్తా ఎంపికచేసుకుంది. నన్ను నమ్మి కొనుగోలు చేసినందుకు జట్టు యాజమాన్యం కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జట్టు తరఫున 2014 -17 వరకు ఆడాను. కోల్కతా జట్టు తో మంచి అనుబంధం ఉంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో కప్పు సాధిస్తాననే నమ్మకం ఉంది అంటూ ఉమేష్ యాదవ్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: