ఇదిలా ఉంటే ఈ రోజు గుజరాత్ టైటాన్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ మధ్యన 4 వ మ్యాచ్ సాయంత్రం 7.30 గంటలకు వాంఖడే స్టేడియంలో జరగనుంది. అయితే ఇరు జట్లు ఈ మ్యాచ్ తో ఐపిఎల్ శకాన్ని అరంభించనున్నారు. కాబట్టి రెండు జట్లు గెలుపే ప్రథమ లక్ష్యంగా ముందుకు సాగుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య మరియు లక్నో కెప్టెన్ గా ఇండియా స్టార్ బ్యాట్స్మన్ మరియు కీపర్ కే ఎల్ రాహుల్ లు వ్యవహరిస్తున్నారు. వీరిద్దరికీ వ్యక్తిగతంగా ఐపిఎల్ లో ఎటువంటి రికార్డు ఉంది అనేది తెలిసిందే. అయితే వీరిద్దరికీ జరుగనున్న ఈ సంగ్రామంలో గెలుపు ఎవరిని వరిస్తుంది అన్నది తెలియాల్సి ఉంది.
కానీ పేపర్ మీద చూస్తే గుజరాత్ కన్నా లక్నో జట్టు బలంగా ఉంది. లక్నో లో రాహుల్, డికాక్, మనీష్ పాండే మరియు లూయిస్ లు ఆడితే గెలుపు లాంఛనమే అవుతుంది. అదే విధంగా గుజరాత్ జట్టులో హర్ధిక్, శుబ్ మాన్ గిల్, మిల్లర్ మరియు వేడ్ లు చెలరేగితే విజయం దక్కుతుంది. మరి ఇరు జట్లలో భారీ షాట్ లు ఆడగల యువకులు సైతం ఉన్నారు. మరి ఈ కొత్త జట్ల తొలి ఐపిఎల్ మ్యాచ్ లో విజయం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే ఇంకా కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.