అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ధోనీ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు అని చెప్పాలి. అయితే గతంలో ఫామ్ కోల్పోయి పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన మహేంద్రసింగ్ ధోని ఇక ఇప్పుడు మాత్రం ఫుల్ ఫామ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించే ముందు నాటి నుంచి గత ఏడాది ఐపీఎల్ సీజన్ వరకు కూడా సరైన పరుగులు చేయలేక ఇబ్బందులు పడ్డాడు మహేంద్రసింగ్ ధోని. కానీ ఇక ఈ ఏడాది ప్రారంభమైన ఐపీఎల్ సీజన్లో మాత్రం మొదటి మ్యాచ్ నుంచి అద్భుతంగా రాణిస్తున్నాడు.
కోల్కతా నైట్రైడర్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ధోని ఇక ఇటీవల జరిగిన మ్యాచ్లో ఆరు బంతుల్లో 16 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ధోనీ ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడూ. టి-20లలో వేగంగా ఏడు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ ఘనత సాధించిన తొలి భారతీయ వికెట్ కీపర్ గా అటు ఆరో భారత క్రికెటర్గా నిలిచాడు ధోని. మహేంద్రుడు కంటే ముందు కోహ్లీ,రోహిత్ శర్మ శిఖర్ ధావన్, సురేష్ రైనా, రాబిన్ ఉతప్ప 7 వేలకు పైగా పరుగులు సాధించారు..