ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ప్రస్తుతం ఛాంపియన్ జట్టుగా కొనసాగుతూ ఉంది ముంబై ఇండియన్స్. ఏకంగా  ఐదుసార్లు టైటిల్ గెలిచిన జట్టు గా సత్తా ని నిరూపించింది. అయితే ఇక ఈ ఏడాది కూడా అద్భుతంగా రానించి ఆరుసార్లు టైటిల్ విజేతగా నిలుస్తుందనుకుంటే.. మొదటి మ్యాచ్ లోనే ఓటమి చవిచూసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ముంబై ఓటమి తర్వాత మొదటి మ్యాచ్ కదా అని అభిమానులు కూడా పూర్తిగా లైట్ తీసుకున్నారు. కానీ ఇటీవలే రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచులో కూడా ముంబై ఇండియన్స్ మరోసారి ఓటమి చవిచూసింది. రాజస్థాన్ రాయల్స్ కు కనీసం ఎక్కడ పోటీ ఇవ్వలేకపోయింది.



 దీంతో అభిమానులు అందరూ కూడా నిరాశ మునిగిపోయారు అనే చెప్పాలి. ఏకంగా ఇరవై మూడు పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓడిపోవడం గమనార్హం. 193 పరుగుల లక్ష్యంతో  బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ముంబై ఓడిపోయినప్పటికీ అభిమానులందరి లో ఒకటే ప్రశ్న తలెత్తుతోంది. ముంబై ఇండియన్స్ లో విధ్వంసకర బ్యాట్స్మెన్గా పేరు సంపాదించుకున్న సూర్యకుమార్ యాదవ్ కి ఎందుకు పక్కన పెట్టారు  అన్న విషయాన్ని ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు అందరు.


 గాయం కారణంగా బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో చికిత్స పొందిన సూర్య కుమార్ యాదవ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్ కి అందుబాటులో లేకుండా పోయాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవల ఎన్సీఏ అకాడమీలో రిహాబిలిటేషన్ పూర్తిచేసుకున్న సూర్యకుమార్ యాదవ్ మళ్లీ జట్టుతో కలిసి బయో బబుల్ కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో అందుబాటులోకి వస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ అతని పక్కన పెట్టటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్  ఉంటే ఫలితం మరోలా ఉండేది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ చేసిన ఈ తప్పు కారణంగానే చివరికి ముంబై ఇండియన్స్ ఓడిపోయింది  అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: