క్రీజులోకి వచ్చే ప్రతి బ్యాట్స్మెన్ కూడా తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలి.. అంటే ప్రతి బంతిని కూడా బౌండరీకి తరలించడమె లక్ష్యంగా పెట్టుకోవాలి. అదే సమయంలో అటు బౌలర్లు కూడా తక్కువ సమయంలోనే ఎక్కువ వికెట్లు పడగొట్టాలి లేదా పరుగులను కట్టడి చేయాలి. ఇలా బ్యాట్స్మెన్ బౌలర్ మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎంతో మంది ఆటగాళ్లు విరుచుకుపడుతూ టి20 ఫార్మాట్లో అద్భుతమైన ఇన్నింగ్స్ తో బౌలర్లలో చెడుగుడు ఆడిస్తూ వుంటారు. భారీ పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. మరి భారత్ తరపున ఇక టీ-20 ఫార్మెట్లో అత్యధికంగా పరుగులు చేసిన ఆటగాళ్ళు వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం భారత్ తరఫున టీ-20 ఫార్మెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు కోహ్లీ 10331 పరుగులు చేశాడు ఆ తర్వాత స్థానంలో ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు 9946 పరుగులు చేశాడు. ఇక శిఖర్ ధావన్ 8867 పరుగులతో మూడవ స్థానంలో కొనసాగుతూ ఉండడం గమనార్హం. మాజీ ఆటగాడు సురేష్ రైనా 8654 పరుగులతో నాలుగవ స్థానంలో ఉన్నాడు. రాబిన్ ఉతప్ప 7133 పరుగులతో ఐదవ స్థానంలో కొనసాగుతున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ 7024 పరుగులతో ఆరవ స్థానంలో ఉండడం గమనార్హం..