బ్యాటింగ్ లో రాణించడానికి పెద్దగా అవకాశం లేకపోయినప్పటికీ అటు ఫీలింగ్లో మాత్రం తనదైన మార్క్ చూపించాడు. గత కొన్ని మ్యాచ్ ల నుంచి సూపర్ బ్యాటింగ్ తో అదరగొడుతున్న తిలక్ వర్మ ఏకంగా సూపర్ మాన్ లా డైవ్ చేసి రనౌట్ చేశాడు. ఆకాష్ దీప్ వేసిన 10 ఓవర్లు కవర్స్ దిశగా షాట్ ఆడిన తిలక్ వర్మ కష్టమైన పరుగు కోసం ప్రయత్నించాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మ్యాక్స్వెల్ సూపర్ వేగంతో బంతిని అందుకుని గాల్లోకి డైవ్ చేస్తూ వికెట్లను నేరుగా కొట్టేసాడు. దీంతో తిలక్ వర్మ ఖాతా తెరవకుండానే చివరికి రనౌట్ కాగా పెవిలియన్ చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఇక తిలక్ వర్మ ను రనౌట్ చేసిన మ్యాక్స్వెల్ భారత ఫీల్డర్ మహ్మద్ కైఫ్ ను గుర్తు చేశాడు అంటూ ప్రస్తుతం కామెంట్లు పెడుతున్నారు నేటిజన్లు. 2003 ప్రపంచ కప్ లో అచ్చం ఇలాగే మ్యాక్స్ వెల్ లాగానే గాల్లో డైవ్ చేస్తూ ఇంగ్లాండ్ ఓపెనర్ నిక్ నైట్ మహ్మద్ కైఫ్ ఔట్ చేశాడు. అప్పట్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ అయిన నైట్ సైతం తిలక్ వర్మ లాగానే కవర్స్ లోకి ఆడటం ఇలా అన్నీ అచ్చుగుద్దినట్టు జరిగిపోయాయని చెప్పాలి. కాగా ఎంత ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది..