బీసీసీఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా స్వదేశీ ఆటగాళ్లు మాత్రమే కాదు అటు విదేశీ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ లో ఆడటానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అంతేకాదు తమ దేశ క్రికెట్ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకుని మరి ఇక ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఐపీఎల్ లో జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా అటు ఐపీఎల్లో సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లది ప్రత్యేక స్థానం అని చెప్పాలి. ఎన్నో జట్లలో ఆడుతున్న సౌత్ఆఫ్రికా ఆటగాళ్లు తమ ఆటతీరుతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు


 ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో కూడా ఎంతోమంది సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ళు ఐపీఎల్ లో కొనసాగుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే అటు సౌత్ ఆఫ్రికా జట్టు బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది.  కానీ ఐపీఎల్ లో సెలెక్ట్ అయిన ఆటగాళ్లు తమ దేశ క్రికెట్ బోర్డు అనుమతి తీసుకుని ఇక బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కాదని ఐపీఎల్ లో చేరి పోయారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇదే విషయంపై ఇటీవల సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కాదని ఎంతోమంది సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు ఐపీఎల్లో బరిలోకి దిగారు. ఇక ఇప్పుడు వాళ్ళని సౌత్ ఆఫ్రికా జట్టులోకి ఎంపిక చేయడం చాలా కష్టమైన విషయం అంటూ డీన్ ఎల్గర్  చెప్పుకొచ్చాడు. ఇక అది తన చేతుల్లో లేదు అంటూ తెలిపాడు. ఇక ఐపీఎల్ సీజన్ కు సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు అందుబాటులో ఉండేలా క్రికెట్ సౌతాఫ్రికా బీసీసీఐ మధ్య ఇప్పటికే ఒప్పందం కూడా కుదిరిపోయింది అంటూ డీన్ ఎల్గర్  చెప్పుకొచ్చాడు. కాగా సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్  చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ip