కానీ ఇప్పటివరకు చాహల్ బ్యాటింగ్ లో పెద్దగా రాణించిన దాఖలాలు మాత్రం లేవు. ఒకవేళ చాహల్ బ్యాటింగ్ కి వచ్చినప్పటికీ ఇక తక్కువ పరుగులు చేసి వికెట్లు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో 11 వికెట్లతో టాప్ లో కొనసాగుతున్న చాహల్ ఇప్పుడు బ్యాటింగ్ లో కూడా రాణించాలని చూస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉన్నాడు చాహల్. ఇందుకు సంబంధించిన వీడియోలను రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంది.
ఈ క్రమంలోనే బ్యాటింగ్ ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్న చాహల్ కొన్ని బంతులను వదిలేయగా మరికొన్నింటిని సిక్సర్లు బాదెందుకు ప్రయత్నించాడు. ప్రాక్టీస్ ముగిసిన సమయంలో నెట్స్ నుండి బయటకు వస్తున్న అతను ఇక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజా లాగానే బ్యాట్ తిప్పేసాడు. రవీంద్ర జడేజా అర్ధ శతకం లేదా శతకం సాధించిన సమయంలో బ్యాట్ ను కత్తి లా తిప్పుతూ ఉంటాడు అనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు చాహల్ కూడా అచ్చం ఇలాగే ఒంటిచేత్తో బ్యాట్ తిప్పుతూ ఉన్నాడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది..