అయితే మనము ఎంతగానో అభిమానించిన ప్రేమించిన ఆ క్రికెటర్ ఒకానొక రోజు మరణించారు అని తెలిస్తే? ఆ బాధను మాటల్లో వర్ణించడం చాలా కష్టం. కానీ కొన్ని కఠిన సమయాలలో ఇలాంటివి అనుభవించక తప్పదు. అయితే ఆ రోజు ఇదే అని చెప్పాలి. ఈ రోజు ఒకే దేశానికి చెందిన ఇద్దరు క్రికెటర్లు మరణించడం క్రీడాలోకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. అయితే వారెవరో ఇప్పుడు చూద్దాం.
బంగ్లాదేశ్ కి చెందిన మాజీ క్రికెటర్లుగా తెలుస్తోంది. ఒకరు సమియుర్ రెహ్మాన్ మరియు ఇంకొకరు మోషరప్ హుస్సేన్ లు, బాంగ్లాదేశ్ జట్టుకు విశేషమైన సేవలను అందించిన ఈ ఇద్దరు క్రికెటర్లు ఒకే రకమైన వ్యాధితో మరణించడం జరిగింది. వీరిలో సమియుర్ రెహ్మాన్ బాంగ్లాదేశ్ మొట్టమొదటి వన్ డే టీమ్ లో సభ్యుడని తీరుస్తోంది. ఈయన 1986 వ సంవత్సరంలో ఆసియా కప్ ఆడిన టీమ్ లో ఉన్నాడు. అయితే గత కొద్ది కాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధ పడిన సమియుర్ ఈ రోజు ఢాకాలో తన ఆఖరి శ్వాసను వదిలాడు. ఇక మోషారప్ హుస్సేన్ సైతం బ్రెయిన్ ట్యూమర్ తో చనిపోవడం జరిగింది. ఈయన బంగ్లాదేశ్ తరపున 5 వన్ డే లు ఆడి ఉన్నారు. వీరిద్దరి మరణంతో బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్లు తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. వీరిని అభిమానించిన ఎందరో ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు.