బీసీసీఐ ప్రతియేడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఇక ప్రతి సీజన్లో కూడా కొత్త ప్రతిభ తెర మీదికి వచ్చి హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది యువ ఆటగాళ్లు సత్తా చాటుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. అద్భుతమైన ప్రతిభతో ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఒక బౌలర్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అతని ప్రతిభకు అందరూ ఏదో అవుతున్నాడు. 150 కి. మీ కంటే వేగంగా అతను సంధిస్తున్న బంతులు చూసి అందరూ ఆశ్చర్యంతో మునిగిపోతున్నారు. అందరూ అతని గురించి చర్చించుకుంటున్నారు అని చెప్పాలి.



 ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో సెన్సేషనల్ బౌలర్ గా కొనసాగుతున్న ఉమ్రాన్ మాలిక్ 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతూ ఉన్నాడు. అందరూ దీని గురించి చర్చించుకుంటూ ఉండటం గమనార్హం. ఈ విషయంపై ఇటీవలే మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. ఉమ్రాన్ మాలిక్ వైడ్ గా బంతులు వేయకుండా వికెట్ టు వికెట్ బంతిని సంధిస్తే అతనిని ఎదుర్కోవడం ఎంతో కష్టం అంటూ చెప్పుకొచ్చాడు.  పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 150 కిలోమీటర్ల వేగానికి పైగా బంతులు వేయడంపై  స్పందించిన సునీల్ గవాస్కర్. ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్లో లెఫ్ట్ సైడ్ వైడ్ గా వేయకుండా నియంత్రించుకుంటే అతను గొప్ప బౌలర్ గా ఎదుగుతాడు. ఇలా చేయడం ద్వారా బంతి నేరుగా వికెట్లకు సంధించే అవకాశం ఉంటుంది. అయితే ఇక అతడికి లభించే ఫేస్ బంతిని ఎదుర్కోవడం ఏ బ్యాట్స్మెన్ అయినా అంత తేలికైన విషయం కాదు. వికెట్ టూ వికెట్ బౌలింగ్ చేయడం వల్ల ఇక అతన్ని ఎవరూ ఎదుర్కోలేని విధంగా తయారవుతాడు అంటూ సునీల్ గవాస్కర్  చెప్పుకొచ్చాడు. మరికొంత మంది మాజీ క్రికెటర్లు కూడా అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl