ప్రస్తుతం టీమిండియాలో స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్న శిఖర్ ధావన్ ఎప్పుడు టీమిండియాకు భారీ ఓపెనింగ్స్ అందించడంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు. అద్భుతమైన ఆట తీరుతో ఇక భారత క్రికెట్లో అభిమానులందరికీ కూడా గబ్బర్ గా మారిపోయాడు. శిఖర్ ధావన్ ఇక ఒక సారి బ్యాటింగ్ లో కుదురుకున్నాడు అంటే చాలు అటు ప్రత్యర్థులపై సింహంలా విరుచుకుపడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తూ ఉంటాడు. ఇకపోతే గత కొంత కాలం నుంచి టీమ్ ఇండియాలో కాంపిటీషన్ ఎక్కువైన నేపథ్యంలో ఎక్కువగా అవకాశాలు దక్కించుకోలేక పోతున్నాడు దావన్.


 ఇకపోతే ప్రస్తుతం టీమిండియా సీనియర్ క్రికెటర్ గా కొనసాగుతున్న శిఖర్ ధావన్ ఇప్పటి వరకు ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు అనే విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే ఐపీఎల్ లో భాగంగా మరో 3 అరుదైన రికార్డులను అందుకున్నాడు శిఖర్ ధావన్. గత ఏడాది వరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శిఖర్ధావన్ ఇక ఈ ఏడాది నుంచి మాత్రం పంజాబ్ కింగ్స్ జట్టు లో కొనసాగుతున్నాడు. ఆ జట్టుకు మంచి ఓపెనింగ్స్ అందిస్తూ ఉన్నాడు. అయితే ఇటీవలే పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్లో భాగంగా రెండు అరుదైన రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు శిఖర్ ధావన్.


 విరాట్ కోహ్లీ తర్వాత ఐపీఎల్ లో ఆరు వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండవ ఆటగాడిగా నిలిచాడు శిక్కర్ ధావన్.  కాగా ఈ లిస్టులో రోహిత్ శర్మ 5764,  డేవిడ్ వార్నర్ 5668, సురేష్ రైనా 5528 తర్వాత స్థానంలో ఉండడం గమనార్హం. అదే సమయంలో ఇప్పటి వరకు టి20 ఫార్మాట్లలో తొమ్మిది వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు శిఖర్ ధావన్.   ఇక మరోవైపు శిఖర్ ధావన్ ఇక నేడు చెన్నై సూపర్ తో జరుగుతున్న  మ్యాచ్ లో ఇక ఐపీఎల్ లో తనకు రెండు వందల మ్యాచ్ కావడం గమనార్హం. ఐపీఎల్ లో కొందరు ఆటగాళ్లు 200 మ్యాచ్ లు ఆడి ఉన్నారని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: