ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఐపీఎల్ లో స్పీడ్ గన్ గా పేరు సంపాదించుకున్న ఉమ్రాన్ మాలిక్ గురించే చర్చించుకుంటున్నారు. అతని బౌలింగ్ వేగంతో ప్రస్తుతం ఐపీఎల్ లో హాట్ టాపిక్ గా మారి పోయాడు. కేవలం వేగంగా బంతులు వేయడమే కాదు కీలక సమయంలో వికెట్లు పడగొట్టి ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ప్లేయర్ గా కొనసాగుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే అతని అద్భుతమైన ప్రదర్శనను చూసిన ఎంతో మంది మాజీ క్రికెటర్లు అతన్ని భారత జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. జమ్మూకాశ్మీర్ కు చెందిన ఈ యువ బౌలర్ ప్రస్తుతం ప్రతి మ్యాచ్లో కూడా అదరగొడుతున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తో ఏదైనా జట్టు మ్యాచ్లు ఆడుతుంది అంటే ఇక ఆ మ్యాచ్ మొత్తంలో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ వేగాన్ని బ్రేక్ చేసే బౌలర్ అస్సలు కనిపించడం లేదు అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే ఇలాంటి ప్రతిభావంతుడూ ఇక టీమిండియాలో ఫ్యూచర్ స్టార్ గా ఎదుగుతాడూ అని అతన్ని ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా టీమిండియా లోకి తీసుకోవడం బెటర్ అంటూ మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పుడు మాజీ క్రికెటర్లు మాత్రమే కాదు ఏకంగా పొలిటీషియన్స్ సైతం ఉమ్రాన్ మాలిక ఆటతీరుకు ఫిదా అయిపోయారు అన్నది తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవలే ఒక పొలిటీషియన్ ఉమ్రాన్ మాలిక్ ను వెంటనే టీమిండియా లోకి తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు ఓ రాజకీయ నాయకుడు. ఆయన ఎవరో కాదు అందరికీ తెలిసిన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం.



 ఇటీవలే ఉమ్రాన్ మాలిక్ ప్రతిభ పై స్పందించిన ఆయన ప్రశంసలు కురిపించారు. అతనికి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి వీలైనంత త్వరగా టీమిండియా లోకి తీసుకూరావాలి అంటూ ఆకాంక్షించారు. ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్తో తుఫాన్ సృష్టిస్తున్నాడు. అతడి భయంకరమైన ఫేస్ బౌలింగ్ దూకుడుతనం కళ్ళారా చూడాల్సిందే. గుజరాత్ పై ప్రదర్శన తోనే ఉమ్రాన్ మాలిక్ ఈ సీజన్లోనే బెస్ట్ ఆటగాడిగా నిలిచిపోతాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అంటూ మాజీ మంత్రి చిదంబరం పొగడ్తలతో ఉమ్రాన్ మాలిక్ ను ఆకాశానికెత్తేశాడూ.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl