ఇప్పటివరకు ఆడినా 8 మ్యాచ్ లలో కూడా ప్రత్యర్థికి ఎక్కడ పోటీ ఇవ్వలేక చివరికి ఓటమి చవిచూసింది. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ ఆట తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు ఓపెనర్గా బరిలోకి దిగేందుకు భారీ ఓపెనింగ్స్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి మాత్రం సరైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ పేలవమైన ఫాం పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. సరే రోహిత్ శర్మ విఫలమవుతున్నాడూ. ఇక మరో ఓపెనర్ అయిన ఇషాన్ కిషన్ అయినా రాణిస్తాడు అని అనుకుంటే అతను కూడా పెద్దగా రాణించడం లేదు.
అతనిపై నమ్మకంతో 15.25 కోట్లకి ముంబై ఇండియన్స్ అతన్ని సొంతం చేసుకుంది. కానీ అతనికి పెట్టిన ధరకు అతను న్యాయం చేయలేక పోతున్నాడూ అని చెప్పాలి. ముంబై ఇండియన్స్ లోని ఇద్దరు ఓపెనర్లు రాణించకపోవడంపై ముంబై ఇండియన్స్ కోచ్ రాబిన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇషాన్ కిషన్ ఆట తీరును మెరుగుపరిచేందుకు కొన్ని అంశాలను గుర్తించాము.. వాళ్ళిద్దరూ మిగతా మ్యాచ్ లలో తిరిగి బలం పుంజుకుంటారూ రోహిత్ కూడా ఎంతగానో కష్టపడుతున్నాడూ. తన బాధ్యత ఏంటో రోహిత్ శర్మ కు బాగా తెలుసు. బలంగా తిరిగి వస్తాడు అన్న నమ్మకం ఉంది అంటూరాబిన్ సింగ్ చెప్పుకొచ్చాడు.