అయితే ముంబై ఇండియన్స్ మొదటి విజయం సాధించడంలో అటు అరంగేట్రం చేసిన ఓ యువ ఆటగాడు కారణం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక రకంగా చెప్పాలంటే ముంబై ఇండియన్స్ బౌలర్లు సమష్టిగా రాణించడంతో కారణంగానే ముంబై జట్టు విజయం సాధించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ మ్యాచ్ విన్నర్ కుమార్ కార్తికేయ ఆరంగేట్రం మ్యాచ్ లోనే తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. మొదటి మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి కార్తికేయ కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ కూడా సాధించాడు. ఈ క్రమంలోనే అతని ప్రతిభ తో అందరిని ఆకర్షించాడు అని చెప్పాలి.
ముఖ్యంగా ఎంతో దూకుడుగా ఆడుతున్న డేంజరస్ సంజూ శాంసన్ ను అవుట్ చేసి అటు రాజస్థాన్ పరుగులు జోరుకి కార్తికేయ బ్రేకులు వేసాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో ఈ కార్తికేయ ఎవరు అనే అంశంపై ప్రస్తుతం పెద్ద చర్చలు జరుగుతున్నాయని చెప్పాలి. ఈ ఆటగాడు గురించి కాస్త వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ ముంబై ఇండియన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్తికేయ టోర్నీలో మధ్యప్రదేశ్ తరఫున ఆడుతున్నాడు. 2018లో లిస్ట్ ఏ తరుపున క్రికెట్లో కార్తికేయ అరంగేట్రం చేసాడు. కాగా ఈ యువ ఆటగాడు ఇప్పటి వరకు తొమ్మిది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు.. 19 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 35 వికెట్లు లిస్ట్ ఏ క్రికెట్ లో 10 వికెట్లు పడగొట్టాడు.