ఈ రోజు ఐపీఎల్ లో భాగంగా చెన్నై మరియు బెంగుళూరు జట్ల మధ్యన మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కూడా చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే ఇక తక్కువ మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉండడంతో పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానంలో స్థానం కోసం అన్ని జట్లు పోటా పోటీగా తలబడుతున్నాయి. అయితే లీగ్ ఆరంభం నుండి ఇప్పటి వరకు చెన్నై 9 మ్యాచ్ లు ఆడగా వాటిలో కేవలం రెండు మ్యాచ్ లు గెలుచుకుని, ఎవ్వరూ ఊహించని రీతిలో 7 మ్యాచ్ లను ప్రత్యర్థులకు అప్పగించింది. ముఖ్యంగా చెన్నై అభిమానులు వీరి ఆటతీరు పట్ల తీవ్ర నిరాశలో ఉన్నారు. గత ఐపీఎల్ సీజన్ లో టైటిల్ గెలిచిన చెన్నై నుండి ఈ విధమైన ప్రదర్శన ఎవ్వరికీ మింగుడుపడడం లేదు.

అందుకే ఈ సీజన్ లో కనీసం ప్లే ఆప్స్ కు చేరుకున్నా చాలు అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యిపోయారు. అయితే ఇది జరగడం అంత సులభం కాదు. చెన్నై కన్నా ధీటుగా ఆడుతున్న జట్లను దాటుకుని మిగిలిన ౫ మ్యాచ్ లలో అన్నింటినీ గెలిచి ప్లే ఆప్స్ పోరుకు పోటీ పడడం సవాలుతో కూడుకున్న విషయం. అయితే అసాధ్యం అయితే కాదు అని చెప్పాలి. అయితే అంతకన్నా ముంచేందు ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ లో గెలిచి తీరాలి.

ముందుగా టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది, బదులుగా బెంగుళూరుజట్టు నిర్ణీత 20 ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఈ పిచ్ పైన ఈ స్కోర్ ను సాధించడం సులభమే అయినా బెంగుళూరు కు ఉన్న బౌలింగ్ వనరులు బట్టి చూస్తే అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఒకానొక దశలో స్కోర్ 190 అవుతుందని భావించిన బెంగుళూరు అభిమానులకు శ్రీలంక స్పిన్నర్ మహేష్ తీక్షణ ఒకే ఓవర్ లో మూడు వికెట్లు తీసి షాక్ ఇచ్చాడు. లేకుంటే మరో 20 పరుగులు వచ్చి ఉండేవి. బెంగుళూరు జట్టులో యువకెరటం లొమ్రార్ కేవలం 27 బంతుల్లో 3 ఫోర్లు మరియు 2 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక చివర్లో దినేష్ కార్తీక్ 26 పరుగులు చేసి బెంగుళూరు కు ఆ స్కోర్ అయినా అందించాడు. మరి డు ఆర్ డై మ్యాచ్ లో ఈ స్కోర్ ను చెన్నై ఛేదిస్తుందా ?

మరింత సమాచారం తెలుసుకోండి: