ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా టేబుల్ టాపర్ గా కొనసాగుతున్న గుజరాత్ టైటాన్స్.. ఇప్పటికే పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది ఐపీఎల్ లో ప్లే అవకాశాలను పోగొట్టుకున్న ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే.. ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ ని ఓడించిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ లో రెండో విజయాన్ని నమోదు చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ అభిమానులందరికీ కూడా షాక్ తగిలింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ముంబై ఇండియన్స్ గుజరాత్  మధ్య మ్యాచ్ లో ఒక ఆసక్తికర సంఘటన ప్రేక్షకులందరినీ కూడా ఆశ్చర్య పరిచింది.


 సాధారణంగా మేటి ఫీల్డర్లు గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు కొన్ని కొన్ని సార్లు తప్పులు చేస్తూ ఉండడం ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ ఉంటుంది. ఇటీవలే రషీద్ ఖాన్ చేసిన ఫీల్డింగ్ కూడా ఇలాగే ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేసింది అని చెప్పాలి. ప్రదీప్  వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో రెండో బంతిని ఇషాన్ కిషన్ కవర్స్ దిశగా ఆడాడు. అయితే ఎంతో సమర్థవంతంగా బంతిని అందుకొని మంచి ఫీల్డింగ్  చేశాడు రషీద్ ఖాన్. కానీ ఆ బంతిని త్రో విసరడం లో విఫలం అయ్యాడు అని చెప్పాలి. ఆ బంతి అతని కాళ్లకు తాగి మళ్ళీ వెనక్కి వచ్చింది. దీంతో మళ్లీ పరిగెత్తిన రషీద్ ఖాన్ బంతిని అందుకోబోయి పట్టు తప్పి కింద పడ్డాడు.



 ఇక ఈ సారి వేగంగా త్రో వేసినప్పటికీ మిడిల్ స్టంప్ మిస్ అయ్యి బౌండరీ దిశగా పరిగెట్టింది. ఇంతలో మరో ఫీల్డర్  బంతిని అందుకున్నాడు. ఇక ఈ గ్యాప్ లో ఇషాన్ కిషన్ రోహిత్ శర్మలు 2 పరుగులు పూర్తి చేయడం గమనార్హం. ఇక ఇదంతా గమనించిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా రషీద్ ఖాన్ పై సీరియస్ అవ్వకుండా ఏంటిది అన్నట్లుగా నవ్వుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో కర్త వైరల్ గా మారిపోయింది. ఆ తర్వాత బౌలింగ్ చేసిన రషీద్ ఖాన్ ధాటిగా ఆడుతున్న రోహిత్ శర్మ వికెట్ తీసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో 28 బంతుల్లో 48 పరుగులు సాధించి మంచి ఫాంలోకి వచ్చినట్లు కనిపించాడు రోహిత్ శర్మ..

మరింత సమాచారం తెలుసుకోండి: