గత రెండు సీజన్ల నుంచి ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సరైనా ఫినిషింగ్ ఇవ్వలేక తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. కానీ ఈ ఏడాది మాత్రం ఆరంభ మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేసి మరోసారి ఫామ్ లోకి వచ్చాను అని అందరికీ చెప్పకనే చెప్పాడు. ఇక ప్రతి మ్యాచ్ కూడా అదిరిపోయే ఫినిషింగ్ టచ్ ఇస్తూ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతూ ఉన్నాడు. ఇకపోతే ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా మరోసారి ఫినిషర్ గా రాణించాడు అన్న విషయం తెలిసిందే. ఆఖర్లో బ్యాటింగ్కు వచ్చిన మహేంద్రసింగ్ ధోని కేవలం 9 బంతుల్లోనే రెండు సిక్సర్లు ఒక ఫోర్ సహాయంతో 21 పరుగులు చేశాడు.


 చివర్లో ధోనీ ధనాధన్ బ్యాటింగ్ చేయడంతోనే చెన్నై సూపర్ కింగ్స్ 200 పరుగుల మార్కును అందుకుంది అని చెప్పాలి.  ఇక ఆ తర్వాత లక్ష్య ఛేదనలో ఘోరంగా విఫలమైన ఢిల్లీ 117 పరుగులకు ఆలవుట్ అయ్యింది. దీంతో ఘన విజయాన్ని సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అయితే ఇప్పుడు ధోని గురించి ఒక ఆసక్తికర విషయం వైరల్ గా మారిపోయింది. ధోనీ క్రీజులోకి రావడానికి ముందు తన బ్యాట్ ను కొరకడం అలవాటు. టీమిండియాకు ఆడిన సందర్భాల్లో కూడా చాలాసార్లు బ్యాట్ కొరికి పరిశీలించేవాడు. ఇక ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కి ముందు కూడా తన బ్యాట్ కొరుకుతున్న ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు  కొడుతున్నాయి.


 ఇలా ధోని బ్యాట్ కోరడం వెనుక కారణం ఏంటి అన్న విషయంపై  టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని బ్యాట్ కొరకడం పై మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా.. అయితే వినండి ధోనీ తన బ్యాట్ పై ఏదైనా టేప్ ఉండే అవకాశం ఉంటుందని దానిని తొలగించడానికి నోటితో కొరుకుతూ ఉంటాడు. ప్రతిసారి బ్యాట్ కొరకడానికి కారణం ఇదే. టేప్ థ్రెడ్ లాంటివి ఉండకూడని ధోని అనుకుంటాడు. అందుకే మీరు ఎప్పుడైనా ధోని బ్యాట్ గమనించండి. ఎలాంటి టేప్ కనిపించదు అంటు అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: