
ఈ క్రమంలోనే ప్లేఆఫ్ లో అవకాశం దక్కించుకోకపోవడం పై అటు శిఖర్ ధావన్ తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అటు శిఖర్ ధావన్ ను చితక్కొట్టుడు కొట్టాడు. కాగా గబ్బర్ ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడంతో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఇక ఈ సినిమాకు బాలీవుడ్ సినిమా లోని ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ ని జత చేశాడు శిఖర్ధావన్. ఈ వీడియో చూసి అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూస్తే నిజంగానే శిఖర్ ధావన్ పై ఆయన తండ్రి దాడి చేసి కొట్టినట్లుగా ఉంది. కేవలం చెంప దెబ్బ కొట్టడమే కాదు కిందపడేసి కాళ్లతో తన్నడం లాంటి దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.
అక్కడే ఉన్న ఒక పోలీస్ అధికారి వద్దు వద్దు అని ఆపుతున్నప్పటికీ శిఖర్ ధావన్ తండ్రి మాత్రం ఎక్కడా వినలేదు. అందరిని నెట్టుకుంటూ వచ్చి మరి శిఖర్ ధావన్ నీ కొట్టాడు. వీడియో చూసి కొంతమంది ఫ్యాన్స్ నవ్వుకుంటూ ఉంటే.. మరి కొంత మంది ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కాగా ఇక ఐపీఎల్ విషయానికి వస్తే 14 మ్యాచుల్లో 7 విజయాలు 7 ఓటమిలు చవిచూసిన పంజాబ్ జట్టు రన్ రేట్ లో వెనుకబడి ఉండడంతో చివరికి ప్లే ఆప్ కి చేరకుండానే వినుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక పంజాబ్ కింగ్స్ తరఫున శిఖర్ధావన్ అదరగొట్టాడు అని చెప్పాలి. 14 మ్యాచ్ లలో 460 పరుగులు చేయగా ఇందులో 3 అర్థ సెంచరీలు కూడా ఉండటం గమనార్హం..