మొన్నటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రేక్షకులందరికీ ఎంత ఎంటర్టైన్మెంట్ పంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత ఏడాది వరకూ కేవలం ఎనిమిది జట్లతో మాత్రమే సాగిన ఐపీఎల్ పోరు ఇక ఈ ఏడాది ఐపీఎల్ లోకి గుజరాత్ లక్నో లాంటి రెండు జట్లు ఎంట్రీ ఇవ్వడంతో మరింత రసవత్తరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ ఏడాది మెగా వేలం మొదలుకొని ఐపీఎల్ టైటిల్ విజేత వరకు కూడా ప్రతి విషయంలో ప్రేక్షకుల అంచనాలు తారుమారయ్యాయి అన్న విషయం తెలిసిందే. ప్రేక్షకులు ఒకటి అనుకుంటే అక్కడ జరిగింది మాత్రం మరొకటి.


 ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ పోరు మరింత రసవత్తరంగా మారిపోయింది. ఇక ఏ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్న దానిపై కూడా క్లారిటీ లేకుండా పోయింది. దీంతో ప్రేక్షకులు అందరూ టీవీలకు అతుక్కుపోయి మరి వీక్షించారు. అయితే ఇలా మ్యాచ్  జరిగే సమయంలో బాగా రాణించిన ఆటగాళ్ల గురించి వారికి సలహాలు ఇచ్చిన కోచ్ ల గురించి మాత్రమే అందరూ చర్చించుకుంటారు. కానీ మ్యాచ్ సజావుగా జరగడానికి ఎంతో మంది తెరవెనుక హీరోలు ఉంటారు అన్న విషయం తెలిసిందే. మ్యాచ్ జరగడానికి అనువుగా గ్రౌండ్ ని సిద్ధం చేయడం .. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చూసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు ఎంతోమంది స్టేడియం సిబ్బంది.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా గా కొనసాగుతున్న జైషా ఐపీఎల్ సజావుగా జరగడానికి తెరవెనుక కష్టపడి వారి కష్టాన్ని గుర్తించారు. ఈ క్రమంలోనే ఒక భారీ నజరానా ప్రకటించారు. ఐపీఎల్ మ్యాచ్ ల కోసం పనిచేసిన క్యూరేటర్ గ్రౌండ్ మెన్స్ కు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించటం  హాట్ టాపిక్ గా మారిపోయింది.మొత్తంగా 6 స్టేడియం లలో  పనిచేస్తున్న సిబ్బందికి 1.25 కోట్లు ఇస్తున్నట్లు బిసిసిఐ కార్యదర్శి ప్రకటించారు. ఐపీఎల్ మ్యాచ్ల కోసం అద్భుతమైన పిచ్ లను సిద్ధం చేయడం చేసిన క్యూరేటర్ లు గ్రౌండ్ మెన్ లను తెరవెనుక హీరోలుగా అభివర్ణించారు జై షా. మంచి పిచ్ తయారు చేసి ఐపీఎల్ మ్యాచ్లు సజావుగా జరగడానికి ఎంతో తోడ్పాటు అందించి నందుకు1. 25 కోట్లు నజరాన ప్రకటించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: