ఈ క్రమంలోనే ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా సర్ఫరాజ్ ఖాన్ రికార్డు సృష్టించడం గమనార్హం. ఇప్పటివరకు ఏకంగా అన్ని మ్యాచ్ లలో కలిపి 650 పైగా పరుగులు చేశాడు ఈ యువ ఆటగాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సర్ఫరాజ్ ఖాన్ కేవలం 15 ఇన్నింగ్స్ లోనే 150 కంటే ఎక్కువ సగటుతో ఈ రేంజ్ లో పరుగులు చేయడం గమనార్హం. ఇక గత పదమూడు రంజీ ఇన్నింగ్స్ లో సర్ఫరాజ్ ఖాన్ ఒక త్రిబుల్ సెంచరీ, రెండు డబుల్ సెంచరీలు, రెండు సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే ఈ సీజన్లో సర్ఫరాజ్ ఖాన్ కి ఇది మూడో సెంచరీ కావడం గమనార్హం.
అయితే కేవలం సెంచరీ సాధించడమే కాదు జట్టు కోసం సువేడ్ పార్కర్ తో కలిసి రెండు వందల పరుగులకు పైగా భాగస్వామ్యం కూడా నిర్మించడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 21 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోతే ఇక 35 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్ కూడా పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ఆర్మాన్ జాఫర్ 60 పరుగులతో ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఇక అటు వెంటనే వచ్చిన సువెద్ పార్కర్ సర్ఫరాజ్ ఖాన్ లు ఇద్దరూ కూడా సెంచరీలతో రాణించారు. ఉత్తరాఖండ్ కు ఊహించని షాక్ ఇచ్చారు. అయితే సర్ఫరాజ్ ఖాన్ అతి పిన్న వయస్కుడిగా 2015 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఎంట్రీ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఇక రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ జరిగిన సమయంలో 45 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన సమయంలో డ్రెస్సింగ్ రూమ్ కి వెళుతుండగా అప్పటి బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ యువకుడికి నమస్కారం చేసి అభినందనలు తెలిపాడు..