అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే ఇలా తొమ్మిది మంది బ్యాట్స్మెన్లు ఒకే ఇన్నింగ్స్ లో అర్థ సెంచరీ చేయడం మాత్రం ఇక క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి అని చెప్పాలి. ఇంతకుముందు 1893లో ఆస్ట్రేలియాకు చెందిన 8 మంది ఆటగాళ్లు కూడా హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టారు. ఇంక ఇప్పుడు ఏకంగా తొమ్మిది మంది ప్లేయర్లు ఒకే మ్యాచ్లో అర్ద సెంచరీలు చేసి రికార్డు నమోదు చేశారు అని చెప్పాలి. హాఫ్ సెంచరీ చేసిన తొమ్మిది మందిలో సుదీప్ గరామీ(380 బంతుల్లో 21 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 186 పరుగులు చేయగా, అనుస్తుప్ మజుందార్(194 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి సెంచరీలతో మెరిశారు.. ఇక ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ 65 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ అభిషేక్ రమణ్ మొదట 41 పరుగుల వద్ద రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. కానీ మజుందార్ ఔటైన తర్వాత మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి 61 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు.
ఇక ఐదో స్థానంలో వచ్చిన ఎంపీ మనోజ్ తివారి 73 పరుగులతో అదరగొట్టగా .. వికెట్ కీపర్ అభిషేక్ పొరేల్ 68 పరుగులు ఆకట్టుకున్నాడు. షాబాజ్ అహ్మద్ 78 పరుగులు.. ఆ తర్వాత ఎనిమిది, తొమ్మిదో స్థానంలో వచ్చిన మోండల్ 53, ఆకాశ్‌దీప్ 53 పరుగులు అదరగొట్టారు . ఇలా తొమ్మిది మంది బ్యాటర్లు హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో బెంగాల్ జట్టు 7 వికెట్ల నష్టానికి 773 పరుగులు భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయటం గమనార్హం.