ఇక మొదటి సీజన్ లోనే ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఎంతో స్వేచ్చగా బౌలింగ్ చేస్తూ ప్రతిభను నిరూపించుకునీ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే అతని ప్రతిభపై ఎంతో మంది ప్రశంసలు కూడా కురిపించారు. ఈ లిస్టులో ఇప్పుడు టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ కూడా చేరిపోయాడు. మొహసిన్ ఖాన్ ప్రతిభకు సీనియర్ పేసర్ షమి ఫిదా అయినట్లు అతని కోచ్ సిద్ధిఖీ చెప్పుకొచ్చాడు. మెగా వేలం జరుగుతున్న సమయంలో నేను షమి తో పాటే ఫాంహౌస్ లో ఉన్నాను.
షమీ తోపాటు మొహసిన్ ఖాన్ ను కూడా లక్నో కొనుగోలు చేసింది. ఇక ఈ విషయం తెలియగానే నాకు ఒక నాలుగు నెలల సమయం ఇవ్వండి.. మొహసిన్ ఖాన్ ను ఇండియా లోనే అద్భుత ఆల్ రౌండర్ గా తీర్చిదిద్దుతా.. నిజానికి అతను ఒక మంచి బ్యాట్స్మెన్ కూడా పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు తగ్గట్లుగా ఆడుతూ ఉంటాడు అంటూ లక్నో కెప్టెన్ కె.ఎల్.రాహుల్ నాతో చెప్పాడు అంటూ మొహమ్మద్ షమీ తెలిపాడని మొహసిన్ ఖాన్ కోచ్ సిద్ధికి చెప్పుకొచ్చాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో షమి ఎప్పుడు ముందుంటాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. కాగా లక్నో కనీస ధర 20 లక్షలకు అతని కొనుగోలు చేయగా బ్యాటింగ్ చేసే అవకాశాలు మాత్రం దక్కించుకోలేదు మొహసిన్ ఖాన్..