ప్రస్తుతం టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన రిషబ్ పంత్ ఆట తీరు గురించి మాజీ ఆటగాళ్లు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. సొంత గడ్డపై సౌతాఫ్రికాతో టి20 సిరీస్ ఆడుతుంది టీమిండియా. ఈ క్రమంలోనే తొలి రెండు మ్యాచ్ లలో కూడా ఓడిపోయి తీవ్రంగా నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత రెండు మ్యాచ్ లలో మాత్రం అనూహ్యంగా పుంజుకుని విజయం సాధించింద ఈ క్రమంలోనే ప్రస్తుతం  2-2 తో సిరీస్ సమం చేసింది టీమిండియా. అయితే నేడు బెంగళూరు వేదికగా జరగబోయే టి20 మ్యాచ్ ఫలితాన్ని తేల్చే మ్యాచ్ గా మారిపోయింది అని చెప్పాలి.



 ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా..  టి20 సిరీస్ ప్రారంభమైన నాటి నుంచి కూడా కెప్టెన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన రిషబ్ పంత్ వ్యక్తిగత  ప్రదర్శన మాత్రం అటు జట్టుకు మైనస్ గా మారిపోతుంది అనే చెప్పాలి. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా రిషబ్ పంత్ బ్యాటింగ్ తో ఆదుకోవడం లేదు కదా మరింత కష్టాల్లోకి నెడుతూ ఉండడం గమనార్హం. తక్కువ పరుగులకే ఏడు వికెట్లు చేజార్చుకునీ తీవ్ర స్థాయిలో నిరాశ పరుస్తున్నాడు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ బ్యాటింగ్ లో ఉన్న లోపాలపై ఇప్పటికి ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


 ఇక ఇప్పుడు ఇదే విషయంపై సౌత్ ఆఫ్రికా మాజీ బౌలర్ డేల్ స్టెయిన్ సైతం షాకింగ్ కామెంట్స్ చేశాడు. వరుసగా నాలుగు టీ20 లో కూడా రిషబ్ పంత్ చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేశాడని డేల్ స్టెయిన్ చెప్పుకొచ్చాడు. సాధారణంగా మంచి ఆటగాళ్లు తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. కానీ రిషబ్ పంత్ మాత్రం అలా చేయడం లేదు అంటూ డేల్ స్టెయిన్  అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక మరోవైపు దినేష్ కార్తీక్ మాత్రం తన క్లాస్ బాటిల్ తో ఆకట్టుకుంటున్నాడు. బౌలర్ ఏ బంతి వేస్తాడో ముందుగానే ఊహించి మంచి షాట్ ఆడుతున్నాడని డేల్ స్టెయిన్ చెప్పుకొచ్చాడు. మరి ఐదవ మ్యాచ్ లో అయినా రిషబ్ పంత్ రాణిస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: