
అయితే ఇక సౌతాఫ్రికాతో టీమ్ ఇండియా నాలుగో టి20 మ్యాచ్ ఆడగా ఒక్క మ్యాచ్లో కూడా రిషబ్ పంత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడలేదు. ప్రతి మ్యాచ్లో తక్కువ పరుగులకే వికెట్ కోల్పోయి అటు జట్టుకు మైనస్ గా మారిపోతున్నాడు. ఈ క్రమంలోనే ఇక రిషబ్ పంత్ పేలవమైన ఫామ్ పై మాజీ ఆటగాడు వసీం జాఫర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సీనియర్లు జట్టులోకి వస్తే అటు రిషబ్ పంత్ కు అందుకు జట్టులో స్థానం దొరకడం కష్టమే అంటూ వ్యాఖ్యానించాడు. టీమిండియా తర్వాత ఆడే టి20 లలో దినేష్ కార్తీక్ కు ఖచ్చితంగా తుది జట్టులో చోటు దక్కుతోంది అందులో ఎలాంటి సందేహం లేదు అని చెప్పాలి.
ఇటీవలే గాయం బారిన పడిన కె.ఎల్.రాహుల్ కోలుకున్న తర్వాత మళ్లీ జట్టుతో చేరుతాడు. ఇక అప్పటికి రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్లు కూడా టాప్ త్రీ లో కొనసాగుతూ ఉంటారు. ఇక అలాంటి సమయంలో అటు పేలవమైన ఫామ్ లో ఉన్న రిషబ్ పంత్ కు చోటు దక్కడం ఎంతో కష్టంగా మారిపోతూ ఉంటుంది. దినేష్ కార్తీక్ కూడా వికెట్ కీపర్ కావడంతో రిషబ్ పంత్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారిపోతుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేక పోయినప్పటికీ దినేష్ కార్తీక్ జట్టులో చోటు కాయం చేసుకుంటున్నాడు అనేది మాత్రం అర్థం అవుతుంది అంటూ వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.