సొంతగడ్డపై సౌత్ఆఫ్రికా టీంఇండియా ఆడిన టి20 సిరీస్ లో భాగంగా రిషబ్ పంత్ కెప్టెన్గా ఎంపికయ్యాడు అన్న విషయం తెలిసిందే   అయితే మొదటి రెండు మ్యాచ్ లలో ఓడి పోయి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు రిషబ్ పంత్. అతనికి కెప్టెన్సీ అప్పగించి టీమిండియా తప్పు చేసింది ఎంతో మంది ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే ఆ తర్వాత రెండు మ్యాచ్ లలో  టీమిండియాకు విజయాన్ని అందించి పర్వాలేదనిపించాడు. అయితే ఇలా కెప్టెన్గా పరవాలేదనిపించినా ఒక బ్యాట్స్ మెన్ గా మాత్రం పూర్తిగా నిరాశ పరిచాడు అని చెప్పాలి. అతని పేలవమైన ఫామ్  పై మాజీ క్రికెటర్లు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


 మొత్తంగా నాలుగు మ్యాచ్ లలో కలిపి రిషబ్ పంత్ కేవలం 57 పరుగులు మాత్రమే చేశాడు. చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం కూడా లేదు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఇటీవల రిషబ్ పంత్ బ్యాటింగ్ పై విమర్శలు చేశారు. షాట్ సెలక్షన్లో తప్పు చేస్తున్నాడని అందుకే వికెట్ చేజార్చుకుంటున్నాడు అంటూ వ్యాఖ్యానించాడు. అయితే రిషబ్ పంత్ స్థూలకాయుడు అయ్యాడు అంటూ డానిష్ కనేరియా  కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేశాడు. ఓవర్ వెయిట్ కారణంగా ఫిట్నెస్ సమస్యలు  ఎదుర్కొంటున్నాడని చెప్పుకొచ్చాడు. అతడు బ్యాటింగ్ శైలిని మెరుగుపరుచుకోవడం పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపాడు. బ్యాటింగ్ శైలి మార్చుకోకపోతే  అతని స్థానం కోల్పోయే అవకాశం ఉందని తెలిపాడు.


 రిషబ్ పంత్ వికెట్ కీపర్గా కూడా పెద్దగా రాణించడం లేదని డానీష్ కనేరియా కామెంట్ చేశాడు. ఫాస్ట్ బౌలర్లు బంతులను వేస్తున్న సమయంలో వికెట్ల వెనకాల రిషబ్ పంత్ వంగటం లేదని అలాగని మోకాళ్ళ మీద కూడా కూర్చోవటం లేదని నిలబడే కీపింగ్ చేస్తున్నాడని దీనికి ప్రధాన కారణం అతను స్థూలకాయుడిగా మారడమే.. వికెట్ల వెనకాల బద్దకంగా కదులుతున్నాడు అంటు చెప్పుకొచ్చాడు. కేఎస్ భరత్,   వృద్ధిమాన్ సాహా లాంటివి వికెట్ కీపర్ లు అందుబాటులో ఉన్న సమయంలో రిషబ్ పంత్ కి  కొంత విశ్రాంతి కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ ఫాంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్  కనేరియా చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీసాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: