
అయితే ఈ ఏడాది గుజరాత్ తరఫున సూపర్ ఫినిషెర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రాహుల్ తేవాతీయకు మాత్రం టీమిండియాలో అవకాశం రాలేదు. దీంతో ఐర్లాండ్ పర్యటనకు వెళ్ళపోయే టీమిండియా జట్టు వివరాలను బిసిసీఐ సోషల్ మీడియాలో ప్రకటించిన వెంటనే తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ అంచనాలు బాధిస్తాయి అంటూ నిరసన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే రాహుల్ తేవాతీయ చేసిన వ్యాఖ్యలపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ట్విట్టర్ పై కాదు ఆటపై దృష్టి పెట్టు అంటూ తేవాతీయకు చురకలు అంటించాడు గ్రేమ్ స్మిత్.
ప్రస్తుతం ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. ఇలాంటి సమయంలో భారత జట్టులో సులభంగా చోటు దొరకడం చాలా కష్టం. కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టీ20 ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకుని టీమిండియాను ఎంపిక చేస్తున్నారు. అందుకే మీరు ట్విట్టర్ కు బదులుగా ఆటపై ఎక్కువగా దృష్టి పెడితే.. మరింత అద్భుతమైన ప్రదర్శన చేయొచ్చు.. అలా చేస్తే తర్వాత సిరీస్లకు జట్టును ఎంపిక చేసేటప్పుడు మీ పేరు కచ్చితంగా బీసీసీఐ సెలక్టర్ల దృష్టిలో ఉండేలా చూసుకోవచ్చు అంటూ గ్రేమ్ స్మిత్ వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్ తరఫున 16 మ్యాచ్లో 147 స్ట్రైక్ రేట్ తో 217 పరుగులు చేశాడు తేవాతీయ.