ఇలా ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ లో ఎంతో మంది ఆటగాళ్లు డబుల్ సెంచరీలు సాధించారు. అయితే జట్టులోని ఆటగాళ్లు డబుల్ సెంచరీలు సాధించడం కొత్త విషయం కాదు. కానీ జట్టును ముందుకు నడిపించే బాధ్యతను భుజాన వేసుకున్న కెప్టెన్ ఒత్తిడిని తట్టుకుని డబుల్ సెంచరీలతో అదరగొట్టడం మాత్రం ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. ఇలా ఎక్కువసార్లు టెస్టు ఫార్మాట్లో డబుల్ సెంచరీలు చేసిన కెప్టెన్లు కేవలం పరిమిత సంఖ్యలోనే ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం..
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ లిస్టులో టాప్ లో కొనసాగుతూ ఉండడం గమనార్హం. టెస్ట్ ఫార్మాట్ లో కెప్టెన్గా ఏకంగా ఏడు డబుల్ సెంచరీలు చేశాడు కోహ్లీ. ఇక ఇందులో బెస్ట్ 254 కావడం గమనార్హం. ఇక వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా టెస్టు ఫార్మాట్లో ఐదు డబుల్ సెంచరీలు చేశాడు. ఇందులో బెస్ట్ 400 పరుగులు. ఆస్ట్రేలియా దిగ్గజం బ్రాడ్మాన్ 4 డబుల్ సెంచరీలు చేశాడు.. ఇందులో బెస్ట్ 270 పరుగులు, మైకేల్ క్లార్క్ నాలుగు డబుల్ సెంచరీ చేయగా ఇందులో 329 బెస్ట్ స్కోర్ కావడం గమనార్హం. గ్రీన్ స్మిత్ నాలుగుసార్లు డబుల్ సెంచరీ చేయగా ఇందులో బెస్ట్ 277, గ్రేగ్ చాపల్ మూడు డబుల్ సెంచరీ చేయగా ఇందులో బెస్ట్ 235, ఫ్లెమింగ్ కెప్టెన్గా 3 డబుల్ సెంచరీ చేయగా బెస్ట్ 274 బ్రెండన్, మెకల్లమ్ 3 డబుల్ సెంచరీ చేయగా బెస్ట్ 302 పరుగులు, కేన్ విలియమ్సన్ 3 డబుల్ సెంచరీ చేయగా ఇందులో బెస్ట్ 251 కావడం గమనార్హం.