ఆ తర్వాత టీ20 వన్డే లలో ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది టీమిండియా. అయితే తరచూ వ్యక్తిగతంగా భారీగా పరుగులు చేస్తూ రికార్డులు సృష్టిస్తూ ఉంటారు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. కానీ ఇప్పుడు మాత్రం ఇంగ్లండ్తో జరిగే వరుస సిరీస్ లలో ఇద్దరూ జంటగా పలు రికార్డులను తమ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ద్వయం టెస్ట్ క్రికెట్లో 940 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇక మరో 40 పరుగులు చేశారు అంటే చాలు ఏకంగా వెయ్యి పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్న జోడి గా నిలుస్తారు. టి20 లలో ఇప్పటివరకు 991 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన రోహిత్- విరాట్ కోహ్లీ ద్వయం 9 పరుగులు చేస్తే 1000 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంటారు.
కాగా ఇప్పటి వరకు వన్డే క్రికెట్లో 4906 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన వీరిద్దరి జోడి మరో 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది అంటే చాలు వన్డేలలో ఐదు వేల పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్న జోడిగా రికార్డు సృష్టిస్తుంది అని చెప్పాలి. ఈ ద్వయం మరో 153 పరుగులు జోడిస్తే రోహిత్ - శిఖర్ ధావన్ జోడి పేరిట ఉన్న 5039 పరుగుల రికార్డును అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన టాప్ 7 జోడిలలో ఒకటిగా నిలుస్తుంది. ఇక అంతే కాకుండా మూడు ఫార్మాట్లలో వెయ్యికిపైగా పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్న జోడీగా కూడా నిలుస్తుంది.