విరాట్ కోహ్లీ.. ఈ పేరు కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టీమిండియాలో స్టార్ బ్యాట్స్ మన్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ మొన్నటివరకు తన కెప్టెన్సీలో టీమిండియాతో ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాడన్న విషయం తెలిసిందే.  మైదానం లో ఎంతో అగ్రేసీవ్ కనిపించే విరాట్ కోహ్లీ టీమిండియాకు దూకుడు నేర్పించాడు అని చెప్పాలి. ఇలా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడుగా ఎంతగానో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ సాధించిన ఎన్నో రికార్డులు ప్రపంచ క్రికెట్లో కోహ్లీ అంటే ఏంటో చెప్పకనే చెబుతుంటాయి.



 ఇకపోతే విరాట్ కోహ్లీ టాటూస్ కు సంబంధించినది వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. విరాట్ కోహ్లీ రెండు చేతుల పైన 11 టాటూ లకు ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయట. ఎడమ చేతి పై భాగంలో తన తల్లిదండ్రుల పేరు అయినా సరోజు, ప్రేమ్ అని రాసి ఉంటుంది. ఇక అంతే కాకుండా అతను అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సందర్భాలను కూడా వేసుకున్నాడు. శ్రీలంకతో 2008 లో   వన్డేలో 175వ ఆటగాడిగా క్యాప్ అందుకున్నాడు. టెస్టుల్లో 269వ ఆటగాడిగా క్యాప్ అందుకున్నాడు. ఈ రెండు నంబర్స్ పచ్చబొట్టుగా ఉంటాయట. దేవుడి కన్ను అనే అర్థం వచ్చే పచ్చబొట్టు కూడా ఉంటుంది. తనను దేవుడు చూస్తున్నాడని పచ్చబొట్టు అర్ధం వస్తుందట.


 అంతేకాకుండా ఓం అనే పచ్చబొట్టు కూడా కోహ్లీ చేతిపై ఉంటుందని తెలుస్తోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఇది గుర్తుచేస్తుంది అనే ఉద్దేశంతో ఓం అనేది పచ్చబొట్టు వేసుకున్నాడు. కోహ్లీ రాశి వృశ్చికం కావడం గమనార్హం. వృశ్చిక రాశికి ఇంగ్లీష్ పదమైన స్కార్పియోను పచ్చబొట్ల వేసుకున్నాడు. ఇక జపనీస్ సమురాయ్ ని కూడా పచ్చబొట్టుగా వేసుకున్నాడు. ఎప్పుడు నిజాయితీగా ధర్మంగా  ఉండేందుకు ఈ పచ్చబొట్టు వేసుకున్నాడట.. ఉదయం లేవగానే ఈ పచ్చబొట్టు చూస్థాడట.  కోహ్లీకి శివుడు అంటే ఎంతో ఇష్టం అందుకే శివుడి రూపం కూడా పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. ఇవే కాకుండా ఏ విషయంలోనైనా ఫోకస్ గా ఉండాలి అనే దానికి ప్రతీకగా ముందు మోనాస్ట్రీ, తనపై తనకు నమ్మకం ఉంది అనే అర్థం ఇచ్చే ట్రైబల్ ఆర్ట్ లను పచ్చబొట్టుగా కూడా ఉంటాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: