ఇటీవల సొంతగడ్డపై సౌత్ ఆఫ్రికా తో జరిగిన టీ20 సిరీస్లో నాలుగు మ్యాచ్ లలో కేవలం 58 పరుగులు మాత్రమే చేశాడు అంటే అతడు ఎంత పేలవమైన ఫామ్ లో ఉన్నాడు అర్థం చేసుకోవచ్చు అయితే ఇదే ఫామ్ లో కొనసాగితే రానున్న రోజుల్లో ఇక జట్టులో చోటు కోల్పోయే పరిస్థితి వస్తుంది అన్నది ప్రస్తుతం అందరూ చెబుతున్న మాట. ఇక ఇప్పటికే రిషబ్ పంత్ కి ప్రత్యామ్నాయంగా కె.ఎల్.రాహుల్, ఇషాన్ కిషన్, దినేష్ కార్తీక్ లాంటి బ్యాట్స్మెన్ కమ్ వికెట్కీపర్ లు ఉండగా ఇక ఇప్పుడు టెస్టుల్లో కూడా ఒక ప్లేయర్ తయారయ్యాడు.
ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. గతంలో కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన రీషెడ్యూల్ టెస్టును జూలై 1వ తేదీ నుంచి ఆడబోతుంది. అంతకు ముందు లిస్టర్ షైర్ తో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది టీమిండియా. ఇక ఈ మ్యాచ్లో బరిలోకి దిగిన తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ తొలి ఇన్నింగ్స్లో 70 పరుగులు చేసి అదరగొట్టేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో 43 పరుగులు చేసి సత్తా చాటాడు. దీంతో ఇక తెలుగు కుర్రాడు రిషబ్ పంత్ కి పక్కలో బల్లెంలా తయారయ్యాడు అంటూ కొంతమంది క్రికెట్ ప్రేక్షకులు అంటున్నారు. రిషబ్ పంత్ రాణించక పోతే అతని స్థానంలో శ్రీకర్ భరత్ ని తీసుకునేందుకు బిసిసిఐ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.