
ఇక పసికూన అలాంటి ఐర్లాండ్ పై భారత్ విరుచుకు పడటం ఖాయమని ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో చిన్న జట్టు కదా అని తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు అని మరి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రెండు జట్ల మధ్య గత రికార్డులను ఒక్కసారి చూసుకుంటే అంతర్జాతీయ క్రికెట్లో భారత్ ఐర్లాండ్ జట్టు ఇప్పటివరకు మూడు మ్యాచ్లలో తలపడ్డాయి. మూడింటిలో టీమిండియా విజయం సాధించింది. 2009 టి20 ప్రపంచ కప్ లో 2018 లో ఐర్లాండ్ భారత్ మధ్య 2 టీ20 మ్యాచ్ లు జరుగగా టీమిండియా గెలిచింది.
ఐర్లాండ్ జట్టు టీమిండియాకు ఎక్కడ పోటీ ఇవ్వలేకపోయింది అని చెప్పాలి. ఇక భారత ఆటగాళ్లకు మంచి రికార్డులు కూడా ఉన్నాయి. ఐర్లాండ్ పై రోహిత్ శర్మ 149 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. ఈ క్రమంలోనే నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారగా.. అటు ఐర్లాండ్ తో పోల్చి చూస్తే భారత జట్టు మాత్రం ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది అని చెప్పాలి. అంతేకాకుండా ఇక ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కించుకునేందుకు ఎంతో మంది ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంది.