
ప్రస్తుతం కోహ్లీ ఫాం పై విమర్శలు వస్తున్న వేళా రాహుల్ ద్రవిడ్ మాత్రం కోహ్లీకి మద్దతుగా నిలుస్తూ ఇక అతని పై ప్రశంసలు కురిపించాడు అని చెప్పాలి. విరాట్ కోహ్లీ ఎంతోమంది భారత ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచాడు అంటూ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కొనియాడాడు. ఇంత అంకితభావంతో పనిచేసే ఆటగాడిని తన జీవితంలో ఇప్పటి వరకు చూడలేదు అంటూ కోహ్లీని ఆకాశానికి ఎత్తేశాడు రాహుల్ ద్రవిడ్. అయితే కోహ్లీ సెంచరీ లు సాధించక పోయినా పర్వాలేదు అతను జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడితే చాలు రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
అదే సమయంలో కోహ్లీ ఫామ్ కోల్పోయాడు అంటూ వస్తున్న విమర్శలపై కూడా స్పందిస్తూ కోహ్లీ ఫామ్ లో లేడు అన్న విషయాన్ని నేను విభేదిస్తున్నాను. ఎందుకంటే కోహ్లీ ఎంతో కష్టపడి పని చేసే వ్యక్తి అతను. ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడిన విధానం అద్భుతమైనది. అతనికి ఎవరి నుంచి ఎటువంటి మోటివేషన్ అవసరం లేదు. సెంచరీ సాధిస్తేనే ఫామ్ లో ఉన్నట్లు కాదు అంటూ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. ఇక హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కోహ్లీ కి మద్దతుగా నిలవడంతో ఇక అభిమానులు అందరూ కూడా ఎంతగానో మురిసిపోతున్నారు అని చెప్పాలి.